జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 … చదవడం కొనసాగించండి

హిందూ పరిరక్షకుల చేతిలో మానవీయ సంస్కృతి విధ్వంసం -ఫొటోలు

“దాడి చేసినవారిలో ఒకడు ఆకలిగొన్న కుక్కలా నా స్నేహితురాలి శరీరం అంతా తాకాడు. ఆటవస్తువులా ఆడుకున్నాడు. నేను వివరించలేను… వాడి అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరే అర్ధం చేసుకోవాలి.” మంగుళూరులో హిందూ సంస్కృతి పరిరక్షకులమంటూ పెచ్చరిల్లిన మూకల దాడిలో బాధితురాలు సిగ్గుతో … చదవడం కొనసాగించండి

జూలై 30, 2012 · 18 వ్యాఖ్యలు

‘బర్త్ డే పార్టీ’ లపై హిందూ సంస్కృతి పరిరక్షకుల అసభ్య దాడి, అరెస్టులు

హిందూ సంస్కృతిని పరిరక్షిస్తామంటూ బయలుదేరిన గుంపు కర్ణాటక లోని మంగుళూరులో మరోసారి వీరంగం ఆడింది. పుట్టిన రోజు పార్టీ జరుపుకుంటున్న యువతీ, యువకుల బృందం పై ‘హిందూ జాగరణ వేదిక’ కు చెందిన మూకలు దాడి చేసి విచక్షణారహితంగా చావబాదారు. పుట్టిన … చదవడం కొనసాగించండి

మరోసారి క్షీణించిన జి.డి.పి, తీవ్ర రిసెషన్ లో బ్రిటన్

వరుసగా మూడో క్వార్టర్ లో కూడా బ్రిటన్ స్ధూల దేశీయోత్పత్తి (జి.డి.పి) పడిపోయింది. గత సంవత్సరం చివరి క్వార్టర్ (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) లో ప్రారంభం అయిన బ్రిటన్ జి.డి.పి పతనం ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) … చదవడం కొనసాగించండి

స్త్రీలపై అత్యాచారాలు, కురచ దుస్తులు, ఒక పరిశీలన

  (స్త్రీల వస్త్రధారణ వారిపై అత్యాచారాలకు ఒక కారణం అంటూ డి.జి.పి దినేష్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా బొందలపాటిగారు తన కోణంలో విశ్లేషిస్తూ ఒక టపా డిసెంబర్ 29 తేదీన రాశారు. సదరు టపా కు స్పందనగా మిత్రులు రాజశేఖర్ రాజు … చదవడం కొనసాగించండి

జూలై 29, 2012 · 13 వ్యాఖ్యలు

ఈవ్ టీజింగ్ కి ఆడపిల్లల డ్రస్సులే కారణం -తృణమూల్ ఎమ్మెల్యే

ఆడవాళ్లపై అత్యాచారాలకు, అత్యాచార ప్రయత్నాలకు వారి కురచ దుస్తులే కారణమని పోలీసు బాసులు, ప్రభుత్వాధికారులు నుండి గ్రామ పెద్దల వరకు ఏకబిగిన వాపోతున్న సంగతి తెలిసిందే. ‘ఈవ్ టీజింగ్’ నేరానికి కూడా ఆడపిల్లల డ్రస్సులే ప్రేరణనిస్తున్నాయని తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే … చదవడం కొనసాగించండి

జూలై 29, 2012 · 1 వ్యాఖ్య

భారత జలాల్లోకి రాకుండా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై నిషేధం

అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య … చదవడం కొనసాగించండి

జూలై 28, 2012 · 1 వ్యాఖ్య

అవినీతి నిర్లక్ష్యాల మూల్యం, స్కూల్ బస్సు రంధ్రంలోంచి జారి బాలిక మృతి

చెన్నైలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సులోపల ఉన్న రంధ్రంలోంచి జారిపడి రెండో తరగతి చదువుతున్న బాలిక చనిపోయింది. బస్సు వెనక చక్రాల కింద పడి నలిగిపోవడంతో ఆరేళ్ళ శృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవాణా అధికారుల … చదవడం కొనసాగించండి

జూలై 27, 2012 · 4 వ్యాఖ్యలు

ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న చైనా, ఐ.ఎం.ఎఫ్ ప్రశంస

ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ని సాధించగలిగిందని ఐ.ఎం.ఎఫ్ చైనాపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచం అంతా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి (slow growth) పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నింటినీ చైనా తట్టుకోగలిగిందని వ్యాఖ్యానించింది. ఇతర దేశాలతో వాణిజ్య మిగులును తగ్గించుకోవడమే కాక … చదవడం కొనసాగించండి

ఇండియన్ హై వే: చైనాలో భారత కళా ప్రదర్శన -ఫోటోలు

“ఇండియన్ హై వే” పేరుతో 2008 నుండి ప్రపంచ వ్యాపితంగా వివిధ నగరాల్లో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లండన్ (2008), ల్యోన్ (ఫ్రాన్స్, 2011), రోమ్ (2011) లలో ప్రదర్శనలు పూర్తయిన అనంతరం చైనాలోని బీజింగ్ లో ప్రస్తుతం నిర్వహించబడుతోంది. చైనాకు … చదవడం కొనసాగించండి

చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు … చదవడం కొనసాగించండి

జూలై 25, 2012 · 7 వ్యాఖ్యలు

ప్రమాదంలో జర్మనీ టాప్ రేటింగ్, ఋణ సంక్షోభమే కారణం

యూరపియన్ యూనియన్ ఆర్ధిక కేంద్రం అయిన జర్మనీని సైతం ఋణ సంక్షోభం చుట్టు ముడుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘మూడీస్’ రేటింగ్ సంస్ధ జర్మనీ క్రెడిట్ రేటింగ్ ‘ఔట్ లుక్’ ను ‘స్థిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) కు తగ్గించింది. తద్వారా … చదవడం కొనసాగించండి

జూలై 24, 2012 · 1 వ్యాఖ్య

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

sai bhargav on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రే…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 546గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 398,644 సార్లు

క్యాలెండరు

జూలై 2012
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 546గురు చందాదార్లతో చేరండి