మంచు ఖండంలో నిత్యాగ్నిహోత్రం ‘మౌంట్ ఎరేబస్’ -ఫొటోలు

క్షణమాత్రంలో ఎర్రని మంటను సైతం శ్వేతశిల గా మార్చగలిగే అంటార్కిటికా వాతావరణంలో నిత్యాగ్నిహోత్రంలా జ్వలించే అగ్నిపర్వతం ‘మౌంట్ ఎరేబస్.’ అంటార్కిటికా లో ‘మౌంట్ సిడ్లే’ తర్వాత ఇదే ఎత్తయినది. శాశ్వత లావా సముద్రం కలిగిన పర్వతంగా ‘మౌంట్ ఎరేబస్’ ప్రాముఖ్యత పొందింది. ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ లో భాగమే మౌంట్ ఎరేబస్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రింగ్ లో ఇంకా 160 చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని ‘నేషనల్ జాగ్రఫిక్’ వెబ్ సైట్ తెలిపింది.…

ఫ్లేమ్: సైబర్ హై వే పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -3

ఇరానియన్ అణు శుద్ధి కేంద్రం ‘నటాంజ్’ లో స్టక్స్ నెట్ వైరస్ సృష్టించిన విధ్వంసం వెల్లడయిన రెండేళ్ల తర్వాత ‘ఫ్లేమ్’ అనే మరో వైరస్ గురించి కంప్యూటర్ నిపుణులు బయటపెట్టారు. ప్రధానంగా ఇరాన్ పై ప్రయోగించబడిన ఫ్లేమ్ ఫైరస్ ఇజ్రాయెల్ తో పాటు, మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా మరికొన్ని చోట్ల కూడా కనుగొన్నామని నెల క్రితం వారు తెలిపారు. ఫ్లేమ్ ఫైరస్ కూ స్టక్స్ నెట్ వైరస్ కూ అనేక పోలికలు ఉన్నాయనీ…

సైన్యం కనుసన్నల్లో పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం -కార్టూన్

శైశవ దశలో ఉన్న పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం మరోసారి మిలట్రీ అధికారం ముందు తలవంచింది. నిజానికి మిలట్రీ పాలన అయినా, సో కాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన అయినా ప్రజలకు ప్రజాస్వామ్యం దక్కే అవకాశాలు పెద్దగా మారవు. పాలక వర్గాల లోని వివిధ సెక్షన్ల మధ్య అధికారం కోసం జరిగే కుమ్ములాటలే ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ గానూ, ‘మిలట్రీ పాలన’ గానూ వేషం వేసుకుని పాక్ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇరు పక్షాల పాలనలోనూ పాకిస్ధాన్ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ…