ఎంబసీ నుండి బైటికి వస్తే అస్సాంజ్ అరెస్టు ఖాయం

జూలియన్ అస్సాంజ్ ఈక్వెడార్ ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు చేయడానికి లండన్ పోలీసులు ఎంబసీ ముందు కాపు కాశారు. ఎంబసీ లోకి ప్రవేశించడం ద్వారా కోర్టు బెయిల్ షరతులలో ఒకటయిన ‘రాత్రి పూట కర్ఫ్యూలో ఉండవలసిన’ నిబంధనను జులియన్ ఉల్లంఘించాడని లండన్ పోలీసులను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. రాత్రి పది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకూ తనకు నిర్దేశించిన ఇంటినుండి అస్సాంజ్ బైటికి రాకూడదనీ, కానీ ఆయన మంగళవారం మొత్తం ఈక్వెడార్ ఎంబసీలో…

మతమౌఢ్యం ప్రజలకు ఇష్టం లేదు, మోడిని ఉద్దేశిస్తూ జె.డి(యు)

ప్రధానమంత్రి పదవి కోసం ఎన్.డి.ఏ లో పోటీ తీవ్రం అయినట్లు కనిపిస్తోంది. మౌతమౌఢ్యం ఉన్నవారిని ప్రధానిగా దేశ ప్రజలు అంగీకరించరని ఎన్.డి.ఏ భాగస్వామి జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు శివానంద్ తివారీ బుధవారం వ్యాఖ్యానించి మోడి పట్ల తమ పార్టీ కి ఉన్న వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేశాడు. 2014 లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో లేక ప్రతిపక్షంలోనే కూర్చోవాలో బి.జె.పి నిర్ణయించుకోవాలని ఆయన హెచ్చరించాడు. నరేంద్ర మోడి ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘మతమౌఢ్యంతో నిండిన…

జూలియన్ అస్సాంజ్ మరో పాచిక, ఈక్వెడార్ ఎంబసీ లో ఆశ్రయం

ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్న జూలియన్ అస్సాంజ్, తనను స్వీడన్ కు తరలించాలన్న లండన్ సుప్రీం కోర్టు తీర్పుని ఎదుర్కోవడానికి మరో పాచిక విసిరాడు. అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్న ఈక్వెడార్ తనకు ఆశ్రయం ఇవ్వాలని జూలియన్ దరఖాస్తు చేశాడు. అందులో భాగంగా బ్రిటన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయాన్ని శరణువేడాడు. ఈక్వెడార్ అధ్యక్షుడు గతంలో జూలియన్ కు ఆశ్రయం ఇవ్వజూపిన నేపధ్యంలో అస్సాంజ్ విసిరిన పాచిక సంచలనం కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రపంచాన్ని గుప్పిట్లో…