కలాం నిజం చెప్పడం లేదు -సుబ్రమణ్య స్వామి

ప్రధాన మంత్రి గా సోనియా గాంధీ నియామకం విషయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిజాలు చెప్పడం లేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించాడు. ప్రధాని పదవికి సోనియా నియామకం జరగదని కలాం ఒక లేఖ కూడా సోనియాకి రాశాడనీ, తీరా ఇప్పుడు అందుకు విరుద్ధంగా చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఇటలీ పౌరసత్వం రద్దు చేసుకోకుండా భారత పౌరసత్వం పొందినందున సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి నాయపరమైన సమస్యలున్నాయని తాను కలాంకి వివరించాననీ,…

టర్నింగ్ పాయింట్స్: సోనియా ప్రధాని పదవికి తగునని భావించిన కలాం

2004 లో విస్తృతంగా జరిగిన మీడియా ప్రచారానికి విరుద్ధంగా సోనియా కోరినట్లయితే ఆమెను ప్రధానిగా అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధపడినట్లు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ‘టర్నింగ్ పాయింట్స్’ పుస్తకంలో వెల్లడి చేశాడు. సోనియాను ప్రధానిని చేయడానికి వ్యతిరేకంగా అనేకమంది రాజకీయ నాయకులు, పార్టీలు తీవ్ర స్ధాయిలో ఒత్తిడి తెచ్చినప్పటికీ, ‘రాజ్యాంగబద్ధంగా సమర్ధనీయమైన’ ఏకైక అవకాశం అదే అయినందున ఆమెను ప్రధానిని చేయడం తప్ప తనకు మరొక మార్గం లేదని కలాం తన పుస్తకంలో వివరించాడు.…

లాభాల్లో షేర్లు, ప్రణబ్ సవరణపై వివరణ ఫలితం?

శుక్రవారం భారత షేర్ మార్కెట్లు అత్యధిక లాభాలతో ముగియగా, రూపాయి బాగా కోలుకుంది. బి.ఎస్.ఇ సెన్సెక్స్ రికార్డు స్ధాయిలో 2.59 శాతం (439 పాయింట్లు) లాభ పడగా డాలరుతో రూపాయి మారకం విలువ దశాబ్ధంలోనే రికార్డు స్ధాయిలో 119 పైసలు పెరిగింది. ఇటలీ, స్పెయిన్ దేశాలకు ఋణాల రేట్లు తగ్గించడానికి యూరోపియన్ దేశాల సమావేశం నిర్ణయాత్మక చర్యలు ప్రకటించడమే భారత మార్కెట్ల ఉత్సాహానికి కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించగా, ప్రణబ్ సవరణపై (GAAR) ఆర్ధిక శాఖ…

ప్రణబ్ సవరణలను వెనక్కి తిప్పడానికి మన్మోహన్ ప్రయత్నాలు?

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నందున ఆర్ధిక మంత్రిత్వ శాఖను చేపట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం సవరణలను వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు పత్రికల వార్తలను బట్టి అర్ధం అవుతోంది. వోడా ఫోన్ లాంటి కంపెనీలు యాభై వేల కోట్లకు పైగా పన్నులు ఎగవేయడానికి ఆస్కారం కలిగించిన లూప్ హోల్ ను పూడ్చడానికి ప్రణబ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గత యాభై యేళ్లకు వర్తించేలా సవరణలను ప్రణబ్ ప్రతిపాదించడంతో జాతీయ,…

దేశంలో కరువు పరిస్ధితులు, పట్టని ప్రభుత్వాలు

వాతావరణ మార్పులు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు స్వామినాధన్ హెచ్చరించాడు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్ధితులు ఏర్పడనున్నట్లు ఇప్పటికే సూచనలు అందుతున్నాయనీ, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ విమర్శించారు.  కొద్ది ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరి కొన్ని చోట్ల ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడుతుందనీ తెలిపాడు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ‘పోస్ట్ మార్టం’ చర్యలకే అలవాటుపడ్డ ప్రభుత్వాలు ధోరణి మార్చుకోవాలని కోరారు. “వ్యవసాయం పై వాతావరణ మార్పుల…

ముంబై దాడుల్లో పాకిస్ధాన్ పాత్ర ధృవపడింది -ఇండియా

ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాకిస్ధాన్ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు ధృవ పడిందని భారత హోమ్ మంత్రి పి.చిదంబరం తేల్చి చెప్పాడు. ‘అబు జిందాల్’ అలియాస్ ‘జబియుద్దీన్ అన్సారీ’ అరెస్టు తర్వాత అతను వెల్లడి చేసిన వివరాలు దాడుల్లో పాక్ పాత్ర ఉందన్న అనుమానాలు నిజమేనని తేలిందని చెప్పాడు. పాక్ ప్రభుత్వ మద్దతుతో ఒక క్రమ పద్ధతిలో టెర్రరిస్టు దాడులు జరిగాయని ఆయన తెలిపాడు. అయితే చిదంబరం వాదనను పాక్ హోమ్ మంత్రి రెహ్మాన్మ్ మాలిక్ తిరస్కరించాడు. ఇండియా…

అచంగ గారూ… శాస్త్రీయ ఆధారాలిచ్చాగా, బదులివ్వండి!

– అచంగ గారి సవాలు ‘ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించలేద’ని. ఆయన తన ఆర్టికల్ లో ఇలా రాశారు. “ఎక్కడా ఫుకుషిమా అణుధార్మికత ఇతరదేశాలకు విస్తరించినట్టు శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకూ లేవు” నా ఆర్టికల్ కింద వ్యాఖ్యలో ఇంకా ఇలా అన్నారు. “మీరిచ్చిన ఆధారాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం ఇప్పటివరకూ శాస్త్రీయంగా నిరూపించబడలేదని ఢంకా బజాయించి చెప్పగలను.” నిజానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కాకపోతే శాస్త్రీయ ఆధారాలను ఉన్నది ఉన్నట్లు చూడకుండా…

ఆయిల్ రాజకీయాల ఫలితం, ముంబై దాడుల అనుమానితుడి అరెస్టు

26/11 ముంబై టెర్రరిస్టు దాడులకు బాధ్యులుగా భావిస్తున్నవారిలో ముఖ్యమైన అనుమానితుడు జబీయుద్దీన్ అన్సారీ ని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. అన్సారీ మహారాష్ట్ర వాసి అయినప్పటికీ టెర్రరిస్టు దాడులు జరుగుతుండగా పాకిస్ధాన్ లో ఉన్న కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలిచ్చిన వారిలో ఉన్నాడని భారత ప్రభుత్వం భావిస్తోంది. సౌదీ అరేబియా నుండి విమానంలో దిగిన అన్సారీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సౌదీ అరేబియాతో నెలల తరబడి సాగించిన దౌత్యం ఫలితంగా అన్సారీ అరెస్టు సాధ్యం…

స్వేచ్ఛా పతనంలో ‘రూపాయి’ -కార్టూన్

రూపాయి జారుడుకి అంతులేకుండా పోతోంది. అమెరికన్ డాలర్ కి రు. 57.01/02 పై (రాయిటర్స్) వద్దకు రూపాయి విలువ చేరింది. 2011 మధ్య నుండి ప్రారంభం అయిన పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పతనాన్ని అడ్డుకోవడానికి మధ్య మధ్యలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు లు పలు చర్యలు చేపట్టినా అవేవీ పని చేయలేదు. 2012 లోనే దాదాపు 7 శాతం వరకూ రూపాయి పతనం అయిందని బిజినెస్ పత్రికలు లెక్క కట్టాయి. ఆసియాలో భారత…

పాఠకులను తప్పుదారి పట్టించడం ఎకాలజిస్టు ‘అచంగ’ కు తగని పని

ఏప్రిల్ మొదటివారంలో నేనొక వార్తలో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల వెలువడిన రేడియేషన్ అమెరికా, యూరప్ లకి కూడా వ్యాపించిందని ఒక వాక్యం రాశాను. దానికి అచంగ గారు అభ్యంతరం చెప్పారు. ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ లవరకూ వచ్చిందనడానికి ఆధారాలు లేవనీ, ఆధారాలు చూపిస్తే తన అభ్యంతరాన్ని వెనక్కి తీసుకుంటానని రాశారు. తాను వృత్తిరీత్యా ఎకాలజిస్టు కావడమే తన సవాలుకు అర్హత అన్నారు. ఆయన సవాలును పక్కనబెట్టి ఆధారాలు మాత్రం ఇస్తానని చెప్పాను. చెప్పినట్లే ఏప్రిల్…

టర్కీ విమానం కూల్చివేత పై నాటో సమావేశం

సిరియా గగనతలంలోకి చొరబడిన టర్కీ విమానాన్ని సిరియా కూల్చివేయడం పై నాటో దేశాలు సమావేశం కానున్నాయి. టర్కీ, నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశం. నాటో సంస్ధ ఆర్టికల్ 4 ప్రకారం సంస్ధ సభ్య దేశం తమ ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వతంత్రత ప్రమాదంలో పడిందని భావించినపుడు నాటో దేశాల సమావేశం కోసం విజ్ఞప్తి చేయవచ్చు. దాని ప్రకారమే నాటో సమావేశం ఏర్పాటు చేయాలని టర్కీ కోరిందని నాటో ప్రతినిధి ఒనా లుంగెస్క్యూ ని…

రాష్ట్రపతి ఎన్నిక: సి.పి.ఎం సిద్ధాంతకర్త ప్రసేన్ జిత్ బహిష్కరణ

సి.పి.ఎం పార్టీ రీసెర్చ్ యూనిట్ కన్వీనర్ ప్రసేన్ జిత్ బోస్ ను ఆ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వానికి సి.పి.ఎం పార్టీ మద్దతు ప్రకటించడానికి నిరసనగా ప్రసేన్ జిత్ పార్టీకి రాజీనామా చేశాడు. రాజీనామా తిరస్కరిస్తూ బహిష్కరణ నిర్ణయాన్ని సి.పి.ఎం పార్టీ తీసుకుంది. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలపై రాజకీయ పోరాటం సాగించాలని ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి.పి.ఎం పార్టీ, ఇంతలోనే కుంటి సాకులతో యు.పి.ఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం సైద్ధాంతిక…

దళిత ద్వేషం, హిందూ ఉన్మాదంతో కుళ్లిపోతున్న బూతుగాడి బూతులివే

పాఠకులు ముందుగా నన్ను క్షమించాలి. బూతు వెధవల ‘బూతు దాడి’ ఎదుర్కోవడానికి నాకు మరో మార్గం కనిపించడం లేదు. వీళ్లకి చదువు ఎలా అబ్బిందో తెలియదు గానీ ‘సమాచార విప్లవం’ ద్వారా సామాన్యులకి అందుబాటులోకి వచ్చిన బ్లాగింగ్ వేదికల్ని కూడా బూతులతో నింపేస్తున్నారు. సభ్యత మరిచి పదిమందిలో బూతులు మాట్లాడేవారిని నలుగురూ ఈసడించుకుంటారు. అలాంటివారు తోటివారి ఈసడింపులతోనయినా బుద్ధి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్లాగ్బూతుగాళ్లకి ఆ అవకాశం లేకుండా పోతోంది. వీళ్ళ బూతుల్ని బహిరంగం…

సిరియా గగనతలంలో చొరబడిన టర్కిష్ విమానం కూల్చివేత

తమ దేశ గగనతలంలోకి చొచ్చుకు వచ్చిన టర్కీ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని సిరియా శుక్రవారం పొద్దు పోయాక ప్రకటించింది. ప్రతిగా ‘అవసరమైన చర్యలను నిశ్చయాత్మకంగా తీసుకుంటాం” అని టర్కీ ప్రకటించింది. ఇరు దేశాల ప్రకటనలతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. ఉద్రిక్తతను ఇంకా పొడిగించడానికి సిరియా మరింత ప్రయత్నం చేయబోదని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ సిరియాలో ‘కిరాయి తిరుగుబాటు’ కు సాయం చేయడానికి టర్కీ లో గూఢచార బలగాలతో తిష్ట వేసిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు…

‘గెలాక్సీ నోట్’ తో ఆడుకునే ఏనుగు -వీడియో

తెలివైన జంతులు మనిషికి కొత్త కాదు. చింపాంజీ, కుక్క లాంటి జంతువులు తమ తెలివితేటల్ని అనేకసార్లు నిరూపించుకున్నాయి. కాని ఏనుగు తెలివితేటలు ప్రదర్శించడం ఇదే కొత్త కావచ్చు. ‘పీటర్’ అనే పేరుగల ఈ ఏనుగు ‘గెలాక్సి నోట్’ తో చలాగ్గా ఆడేస్తోంది. టచ్ స్క్రీన్ పై మనం వేలితో చేసే విన్యాసాల్ని తొండంతో చేసేస్తోంది. ఏనుగు తొండంతో గుండు సూదిని కూడా పట్టుకోగలదని చిన్నప్పుడు చదివాం. టచ్ స్కీన్ ఫోన్లతో చెడుగుడు ఆడుతుందని ఇప్పుడు రాసుకోవచ్చేమో. మీరే…