బి.జె.పి లుకలుకలు: అధ్యక్షుడి పై అద్వానీ అసంతృప్తి?

బి.జె.పి లో లుకలుకలు గణనీయ స్ధాయికి చేరినట్లు ఆ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.  బి.జె.పి జాతీయ కార్యవర్గం సమావేశాలు ముగిశాక గత శుక్రవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో అద్వానీ, సుష్మా పాల్గొనకపోవడం పై ఊహాగానాలు సాగుతుండగానే, అద్వానీ తన బ్లాగ్ ద్వారా తన అసంతృప్తిని మరోసారి వెళ్ళగక్కాడని ‘ది హిందూ’ తెలిపింది. అధ్యక్షుడు నితిన్ గడ్కారీ హయాంలో జరిగిన వివిధ తప్పులను ఎత్తిచూపుతూ పార్టీలో అంతర్మధనం అవసరమని అద్వానీ చెప్పినట్లు పత్రిక తెలిపింది.…

అమెరికా అభ్యంతరాలు పక్కకు నెట్టి ‘నార్త్-సౌత్ కారిడార్’ ముందడుగు

అమెరికా అభ్యంతరాలను పక్కకు నెడుతూ ‘ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్’ శరవేగంతో ముందుకు సాగుతోంది. ఉత్తర, దక్షిణార్ధ గోళాలను కలుపుతూ సాగే ఈ వాణిజ్య మార్గం చారిత్రాత్మక ‘సిల్క్ రోడ్’ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఇండియా, రష్యా, మధ్య ఆసియా ల మధ్య నెలపాటు ప్రయాణాన్ని తగ్గిస్తుందని భావిస్తున్న కారిడార్ లో ఇరాన్ ది కీలక పాత్ర కావడంతో అమెరికాకి అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది. కారిడార్ రూపకల్పనలో ఇండియా, ఇరాన్, రష్యాలు కీలక భాగస్వామ్యం…

ఇరాన్ ఆయిల్: ఇండియాపై దుష్ప్రచారం తగదు -నిరుపమ

ఇరాన్ క్రూడాయిల్ దిగుమతుల విషయంలో ఇండియా పై జరుగుతున్న ప్రతికూల ప్రచారం పనికి రాదని అమెరికాలో భారత రాయబారి నిరుపమా రావు అభ్యంతరం తెలిపారు. 120 కోట్ల మంది ప్రజల ఎనర్జీ అవసరాలను తీర్చవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్న సంగతి గ్రహించాలని ఆమె అమెరికాకి పరోక్షంగా సూచించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను తు.చ తప్పకుండా పాటిస్తున్నామనీ, అమెరికా ఆంక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులనూ తగ్గించామనీ ఆమె వివరించారు. ఇరాన్ క్రూడాయిల్ పట్ల…

విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి, ప్రధానితో అన్నా బృందం

ప్రధాని మన్మోహన్ సింగ్ అవినీతిపరుడు కాకపోతే తమ కంటే సంతోషించేవారు లేరనీ, అయితే ఆ సంగతి విచారణ జరిపించుకుని నిరుపించుకోవాల్సిందేనని అన్నా బృందం స్పష్టం చేసింది. స్వతంత్ర దర్యాప్తు జరిపించుకోవాలని అన్నా బృందం డిమాండ్ చేసింది. ప్రధానిపై అవినీతి ఆరోపణలు చేసింది తాము కాదనీ, రాజ్యాంగ సంస్ధ కాగ్ నివేదిక ద్వారానే తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. “తనపై కేశినా ఆరోపణలు ఆధారహితమనీ, దురదృష్టకరమనీ, బాధ్యతారాహిత్యమనీ ప్రధాన మంత్రి అన్నారు. మేమాయనకి ఒక విషయం చెప్పదలిచాం. ఆరోపణలు…