ఉత్తర కొరియాలో మేము గూఢచర్యం చేస్తున్నాం -అమెరికా మిలట్రీ

ఉత్తర కొరియాలో తాము గూఢచర్యం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారి ఒకరు అంగీకరించాడు. దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలతో కలిసి తాము ఉత్తర కొరియా మిలట్రీ వ్యవస్ధలు కనిపెట్టడానికి గూఢచర్యం నిర్వహించామని తెలిపాడు. పారాచూట్ల ద్వారా ఉత్తర కొరియాలో దిగి అండర్ గ్రౌండ్ లో దాగిన మిలట్రీ వ్యవస్ధలపై సమాచారం సేకరించామని అమెరికా అధికారి చెప్పినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్ధావరాలున్నాయి. దక్షిణ కొరియాలో ‘స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్’ కమాండర్…

ఇరాన్ ఆయిల్ కొనుగోళ్ళు పెంచిన దక్షిణ కొరియా

ఓ వైపు ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను ఇండియా తగ్గించుకుంటుండగా ఇతర ఆసియా దేశాలు మాత్రం పెంచుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను దక్షిణ కొరియా 42 శాతం పెంచినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆంక్షలను చైనాతో పాటు అమెరికా మిత్ర దేశం దక్షిణ కొరియా కూడా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోంది. కొరియా ప్రభుత్వ సంస్ధ ‘కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్’ మంగళవారం వెల్లడించిన గణాంకాలను ప్రెస్…

కాలిఫోర్నియా చేపల్లో ఫుకుషిమా రేడియేషన్

కాలిఫోర్నియా సముద్ర తీరంలో పట్టిన ‘బ్లూఫిన్ తునా’ చేపల్లో ఫుకుషిమా రేడియేషన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాన్ సముద్ర జలాల్లో ఈదుతుండగా ఫుకుషిమా రేడియేషన్ కాలుష్యాన్ని గ్రహించిన తునా చేపలు అనంతరం కాలిఫోర్నియా తీరానికి వచ్చి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చేపల్లోని కాలుష్యం ప్రమాదకరం కాదనీ, అయితే వలస వెళ్ళే సముద్ర జీవుల ద్వారా కాలుష్యం ఎంతటి దూరానికైనా చేరవచ్చన్నదీ తమ పరిశోధన చెబుతోందని వారు తెలిపారు. మార్చి 11, 2011 తేదీన జపాన్ లో పెద్ద…

జగన్ చిరునవ్వు వెనక… -కార్టూన్

జగన్ జైలు వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము లాంటిది. జగన్ అవినీతి అంతా ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిత్వం ఫలితమే. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలోని ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన కీర్తిని ఆ పార్టీయే ఆయనకి ఆపాదించింది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి తేవడమే కాక కేంద్ర పార్టీకి 33 మంది ఎం.పిలను సరఫరా చేసిన కీర్తి కూడా వై.ఎస్.ఆర్ ఖాతాలోనే ఉంది. రాజశేఖర రెడ్డితో…