మన్మోహన్, ప్రణబ్, ఇంకా 15 మంత్రుల అవినీతిపై విచారణ చేయాలి -టీం అన్నా
అన్నా బృందం బ్రహ్మాస్త్రం సంధించినట్లు కనిపిస్తోంది. సత్య సంధుడుగా యు.పి.ఏ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడ్డాడని’ ఆరోపించింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తో పాటు మరో 13 మంది కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. బొగ్గు గనుల కేటాయింపులపై కాగ్ నివేదికను ప్రధానిపై అవినీతి ఆరోపణలకు ఆధారంగా చూపింది. రిటైర్డ్ న్యాయమూర్తులతో ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరింది. అన్నా బృందం ఆరోపణలను కాంగ్రెస్…



