అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

అంతర్జాతీయ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ అమెరికా మానవ హక్కులను కాల రాస్తున్నదని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధగా ప్రాచుర్యం పొందిన ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నివేదిక ఆరోపించింది. రహస్య కమెండో ఆపరేషన్ లో lethal force వినియోగించి ‘ఒసామా బిన్ లాడెన్’ ను  చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది. స్వతంత్ర దేశం యెమెన్ పై డ్రోన్ విమానాలతో దాడులు చేసి అమెరికా పౌరుడు అన్వర్ ఆల్-అవలాకి ని, ఆయన సహచరులను చట్ట విరుద్ధంగా హత్య చేసిందనీ విమర్శించింది.…