లిధుయేనియా, గ్రీసు, ఇటలీ లలో ఫుకుషిమా రేడియేషన్

జపాన్ లో మార్చి 11 తేదీన ఫుకుషిమా అణు కర్మాగారంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల మూడు రియాక్టార్లలో ‘మెల్ట్ డౌన్’ జరిగి ఇంధన రాడ్లు పూర్తిగా కరిగిపోగా, మరొక రియాక్టర్ లో పాక్షికంగా ‘మెల్ట్ డౌన్’ జరిగింది. దీనివల్ల రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశించింది. రేడియేషన్ వల్ల కలుషితమైన నీటిని పెద్ద ఎత్తున సముద్రంలో కలపడంతో సముద్ర నీరు కూడా కలుషితం అయింది. గాలిలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్ధాలు, ముఖ్యంగా అయోడిన్,…

మంత్రి మోపిదేవి అరెస్టు, జగన్ ముందస్తు బెయిల్ దరఖాస్తు

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వనరుల శాఖ మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకట రమణ ను సి.బి.ఐ అరెస్టు చేసింది. కోర్టు ఆయనకి రెండు వారాలు రిమాండ్ కి విధించింది. రిమాండ్ లో ఉండగా వారం రోజులు సి.బి.ఐ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ చెప్పగా, ఐదు రోజుల కస్టడీకి అనుమతించినట్లు ఈ టి.వి తెలిపింది. మరో వైపు కీడు శంకించిన జగన్ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసినట్లు ఎన్.డి.టి.వి…

రెండో భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

భూకంపం, ఫుకుషిమా అణు కర్మాగారాన్ని సాయంత్రం 2:50 ప్రాంతంలో తాకింది. దాదాపు మరో ముప్పావు గంటకి సునామీ అలలు 20 మీటర్ల ఎత్తున విరుచుకుపడి కర్మాగారాన్ని ముంచెత్తాయి. మార్చి 12 తేదీన పొద్దు గుంకక ముందు రియాక్టర్ లో నీటి స్ధాయి పడిపోవడం మొదలయింది. అంటే ఇంధన రాడ్లు వేడెక్కడం మొదలయిందని అర్ధం. దాదాపు సాయంత్రం 4 గంటలకు టెప్కో ఓ ప్రకటన విడుదల చేసింది. “కంటెయిన్ మెంట్ వెసెల్ (containment vessel) లో అధికంగా ఉంది.…

మొదటి భాగం: ఫుకుషిమా ప్రమాదం, సంచలనాత్మక నిజాలు -ది ఇండిపెండెంట్

గత సంవత్సరం మార్చి 11 తారీఖున జపాన్ లో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.9 గా దాని తీవ్రత నమోదయింది. దీనివల్ల అతి పెద్ద సునామీ సంభవించింది. భూకంపం వచ్చిన 47 నిమిషాల తర్వాత సునామీ అలలు జపాన్ తూర్పు తీరాన్ని తాకాయి. 20 మీటర్ల ఎత్తున అలలు విరుచుకు పడ్డాయని పత్రికల ద్వారా తెలిసింది. భూకంపం, సునామీల వలన జపాన్ ఈశాన్య ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉన్న ఫుకుషిమా అణు…