ఈసారీ సకాలంలోనే ఋతుపవనాలు -ఐ.ఎం.డి
ఈ సంవత్సరం కూడా సకాలంలోనే జూన్ 1, 2012 తేదీనే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయని ‘ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్ మెంట్’ మంగళవారం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ప్రవేశించడం దాదాపు ఖాయమయిందనీ తెలిపింది. ప్రతి యేటా మే 20 న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు అనంతరం జూన్ 1 తేదీన కేరళ తీరాన్ని తాకడం ద్వారా దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా వర్షాలపై ఆధారపడే భారత…



