ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజి ఓటమి -యూరోప్ కార్టూన్లు

ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి ఓటమి పై యూరోపియన్ కార్టూనిస్టులు ఇలా స్పందించారు. యూరోపియన్ బహుళజాతి కంపెనీలతో పాటు అమెరికా బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీల నేతృత్వంలో యూరోపియన్ ప్రభుత్వాలు అమలు చేసిన పొదుపు ఆర్ధిక విధానాలతో యూరోపియన్ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. కంపెనీలకు బెయిలౌట్లు పంచిపెట్టడం వల్ల పేరుకున్న అప్పులను కోతలు, రద్దులతో ఇ.యు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో గణనీయ…

క్లుప్తంగా… 07.05.2012

జాతీయం మోడిని ప్రాసిక్యూట్ చెయ్యొచ్చు -అమికస్ క్యూరీ 2002 గుజరాత్ మారణకాండ కేసులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ని ప్రాసిక్యూట్ చేయదగ్గ సాక్ష్యాలున్నాయని సుప్రీం కోర్టు నియమించిన ‘అమికస్ క్యూరీ’ (కోర్టు సహాయకుడు) రాజు రామచంద్రన్ కోర్టుకి తెలియజేశాడు. ఇరు మతాల ప్రజల మధ్య ‘శతృత్వాన్ని ప్రోత్సహించినందుకు’ గాను మోడిని ప్రాసిక్యూట్ చేయవచ్చని ఆయన తన నివేదికలో పేర్కొన్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ అల్లర్లపై విచారణ చేయడానికి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటయింది. దశాబ్దం…

ఇరాన్ ఆయిల్: అమెరికా ఒత్తిడికి ఇండియా ప్రతిఘటన

ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులను మరింతగా తగ్గించాలని అమెరికా తెస్తున్న ఒత్తిడిని భారత ప్రభుత్వం ప్రతిఘటిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రి ప్రకటన సూచిస్తోంది. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను భారత దేశం అమలు చేయాలంటే గల్ఫ్ ప్రాంతంలో నివశిస్తున్న భారతీయుల భద్రత కూడా పరిగణించాలని హిల్లరీ క్లింటన్ కి చెప్పినట్లు విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పత్రికలకు తెలిపాడు. గల్ఫ్ ప్రాంతంలో భారత దేశానికి కీలకమైన భద్రతా ప్రయోజనలు ఉన్నాయని ఆయన అమెరికా అతిధికి గుర్తు చేశాడు.…

‘హజ్’ సబ్సిడీ రద్దు చేసిన సుప్రీం కోర్టు

‘హజ్’ యాత్రకు వెళ్ళే ముస్లిం ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడాన్ని మంగళవారం సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మరో పదేళ్ళలో ‘హజ్’ సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలని తీర్పు నిచ్చింది. మతపరమైన యాత్రలకు సబ్సిడీలు ఇవ్వడం ‘చెడ్డ మతాచారం’ గా అభివర్ణించింది. యాత్రీకులకు తోడు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారిక డెలిగేషన్స్ పంపిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ద్వారా ‘హజ్’ యాత్ర ను రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడింది. “ఈ విధానాన్ని అంతం చేయాలని…

క్లుప్తంగా… 06.05.2012

జాతీయం భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు భోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో వారికి పరిశుభ్రమైన నీరు తాగే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేకపోవడం కారణాలుగా చెప్పడానికి వీల్లేదనీ, ఆగస్టు 13 కల్లా నీటి సౌకర్యం కల్పించిన నివేదిక తనకి…