‘ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అడ్డదారిలో బ్రిటన్ ప్రయత్నం?

‘లండన్ ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఒలింపిక్ క్రీడల ప్రచారం కోసం తన భూభాగాన్ని వినియోగించడం ద్వారా ఒలింఫిక్స్ లో రాజకీయాలు చొప్పించడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ అంటోంది. వివాదానికి కారణమైన ప్రచార ప్రకటనను రూపొందించింది బ్రిటన్ కంపెనీయేనని తెలియడంతో అసలు ఒలింపిక్స్ ని రాజకీయం చేస్తున్నది అర్జెంటీనా దేశమా లేక బ్రిటన్ దేశమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటన్ కి వేల మైళ్ళ దూరంలో దూరంలోనూ,…

క్లుప్తంగా… 03.05.2012

జాతీయం బెంగాల్ ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు –మమత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మూడేళ్లు వడ్డీ చెల్లింపులు నిషేధించాలని తాను చేసిన డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకపోవడం పై మమత ఆగ్రహం వ్యక్తం చేసీంది. ఈ విషయంలో తన బాధ్యతను కేంద్రం విస్మరించడానికి వీల్లేదని, బెంగాల్ ప్రజలేమీ అడుక్కోవడం లేదనీ మమత బెనర్జీ వ్యాఖ్యానించింది. తాము ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదనీ అది వారు ఇచ్చిన హామీయే కనుక దాన్ని నెరవేర్చాలనీ కోరింది. “2000 నుండి…

అనగనగా దుబాయ్ లో… ఫొటోలు

దుబాయ్ ఇప్పుడొక కాస్మోపాలిటన్ ఒయాసిస్సు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవంతి ‘బర్జ్ ఖలీఫా’ దుబాయ్ లోనే ఉంది. అత్యంత విలాసవంతమయిన టూరిస్టు కేంద్రంగా దుబాయ్ భాసిల్లుతోంది. సొమ్ములు అనంతంగా పోగుపడిన వారు వాటిని త్వర త్వరగా ఖర్చు చేసుకోవడానికి దుబాయ్ సందర్శిస్తే సరిపోతుంది. అక్రమ సంపాదనను పెట్టుబడులు పెట్టుడానికీ, అక్రమ డబ్బుని దాచుకోవడానికి దుబాయ్ వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పటి సంగతి. ఇరవై, ముప్ఫై యేళ్ల క్రితం దుబాయ్ పరిస్ధితి ఇది కాదు. పెట్రో డాలర్లు ముంచెత్తి…

రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…