క్లుప్తంగా… 02.05.2012

జాతీయం   రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ బుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్…

ఈజిప్టు అధ్యక్ష అభ్యర్ధికి బ్రిటన్ గూఢచార సంస్ధ ‘ఎం.ఐ6’ ప్రచారం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్న ‘ఆమిర్ మౌస్సా’ కు బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచారులు ప్రచారం చేస్తున్నారని ఈజిప్టు పత్రికలు వెల్లడించాయి. ‘ఇస్లామిక్స్ టైమ్స్’ పత్రిక విలేఖరి పరిశోధనాత్మక కధనాన్ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి ఈ సంగతి తెలిపింది. దుష్ట త్రయ దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు ‘ఇష్టుడు’ గా ఆమిర్ మౌస్సా ఇప్పటికే పేరు సంపాదించాడు. అమీర్ మౌస్సా ప్రచారం చుట్టూ అల్లుకున్న…

సచిన్ రాజ్య సభ్యత్వం వెనుక కాంగ్రెస్ కుట్ర -కార్టూన్

సచిన్ టెండూల్కర్ కి  రాష్ట్ర పతి కోటాలో రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్ కి మోసపూరిత ఉద్దేశ్యాలున్నాయని బాల్ ధాకరే ఆరోపించాడు. బాల్ ధాకరే ఆరోపణలకు ‘ది హిందూ’ కార్టూనిస్టు సురేంద్ర ఇచ్చిన కార్టూన్ రూపం ఇది. కాంగ్రెస్ కి ఏ ఉద్దేశ్యాలున్నాయో ఏమో గాని రాజకీయ చదరంగంలో సచిన్ ఒక పావుగా మారే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి. మరో పక్క రాజ్య సభ సభ్యత్వం స్వీకరించినంత మాత్రాన తాను రాజకీయాల్లోకి రాబోనని సచిన్…

క్లుప్తంగా…. 01.05.2012

రాష్ట్రపతి ఎన్నిక పై ఎన్.డి.ఏ లో విభేదాలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తో సహకరించే విషయమై ఎన్.డి.ఏ కూటమిలో విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉపరాష్ట్ర పతి అన్సారీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బి.జె.పి ప్రకటించడం పట్ల జె.డి(యు) నిరసన తెలిపింది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వెంట తాము లేమని చెప్పుకోవలసిన అవసరం ఉందని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు. తమతో…

ఇంటర్నెట్ బందిపోటు దొంగ గూగుల్, మైనర్ పెనాల్టీతో వదిలేసిన ఎఫ్.సి.సి

ఇంటర్నెట్ వినియోగదారుల సమాచారాన్ని నాలుగేళ్లపాటు దొంగిలించిన గూగుల్ సంస్ధను అమెరికా ‘ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్’ (ఎఫ్.సి.సి) కేవలం $25,000 పెనాల్టీతో వదిలిపెట్టింది. తనకు తెలియకుండా జరిగిందని పదే పదే అబద్ధాలు చెప్పినా గూగుల్ ‘బందిపోటు దోపిడి’ ని లైట్ తీసుకుంది. వేరే అవసరం కోసం రాసిన ప్రోగ్రామ్ పొరబాటున స్ట్రీట్ వ్యూ ప్రోగ్రామ్ లో కలిసిందని పచ్చిగా నాటకాలాడినా ‘మరేం ఫర్వాలేదు’ పొమ్మంది. కార్పొరేట్ కంపెనీలు, ఫెడరల్ రెగ్యులేటర్ సంస్ధలు ఒకరినొకరు సహరించుకుంటూ అమెరికా ప్రజలను నిరంతరం…

ఎన్రికా లెక్సీ: ఇటలీ నౌక, సిబ్బంది వెళ్లిపోవడానికి సుప్రీం అనుమతి

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన కేసులో నౌకతో పాటు సిబ్బంది కూడా భారత దేశం నుండి వెళ్లిపోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 3 కోట్ల రూపాయల బాండు సపర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం మళ్ళీ అవసరం అయితే మళ్ళీ భారతీయ కోర్టులకు హాజరు కావలసి ఉంటుందని కోర్టు ఇటలీ నౌక సిబ్బందికి షరతు విధించింది. కోర్టు సమన్లు జారీ చేసిన ఐదు నెలలలోపు సిబ్బంది కోర్టులకు హాజరు కావాలన్న…