స్విస్ ఖాతాల సమాచారం పొందడానికి నిబంధనలు సరళతరం

స్విస్ బ్యాంకుల్లో దొంగ సొమ్ము దాచిన భారతీయుల సమాచారం పొందడానికి ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు మరింత సరళతరం అయ్యాయని భారత ప్రభుత్వం తెలియజేసింది. ‘బ్లాక్ మనీ’ పై భారత ప్రభుత్వం తలపెట్టిన పోరాటం తాజా పరిణామంతో ఊపందుకుంటుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రహస్య ఖాతాలున్న వ్యక్తుల సమాచారం స్విస్ ప్రభుత్వం మనకు ఇవ్వడానికి ఇకనుండి పేరు, చిరునామా పూర్తిగా ఇవ్వకపోయినా ఫర్వాలేదనీ, సమీప సమాచారం ఇస్తే సరిపోయే విధంగా నిబంధనలు సడలించారనీ ప్రభుత్వం తెలిపింది.…

ఎన్రికా లెక్సీ: కేరళను నిలదీసిన సుప్రీం కోర్టు

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటాలియన్ నౌక రక్షణ బలగాలు కాల్చి చంపిన కేసులో కేరళ ప్రభుత్వ అవగాహనను సుప్రీం కోర్టు నిలదీసింది. నౌక యజమానులు, జాలర్ల కుటుంబాలు కుదుర్చుకున్న ‘రాజీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించలేదని సుప్రీం కోర్టు బెంచి నిలదీసింది. “భారత న్యాయ వ్యవస్ధకే ఇది సవాలు లాంటిది. ఇది అనుమతించరానిది. అత్యంత దురదృష్టకరం” అని ఆర్.ఎం.లోధా, హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. ఒక్క కోటుంబానికి నౌక యజమానులు కోటి…

కొత్త వీసా రూల్స్ తో మోడిని రాకుండా చెయ్యండి -బ్రిటన్ మానవ హక్కుల సంస్ధలు

యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కొత్త వీసా నిబంధనలను నరేంద్ర మోడి కి వర్తింపజేసి బ్రిటన్ కి రాకుండా అడ్డుకోవాలని అక్కడి మానవ హక్కుల సంస్ధలు డిమాండ్ చేశాయి. ఇ.యు దేశాలకు చెందని వారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే వారిని బ్రిటన్ రాకుండా నిషేధించాలని కొత్త నిబంధనను బ్రిటన్ ప్రతిపాదిస్తున్నది. ఈ నిబంధనను మోడీకి వర్తింపజేసి భవిష్యత్తులో ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని మానవ హక్కుల గ్రూపులు ఆదివారం డిమాండ్ చేశాయి. నరేంద్ర మోడి…