యాపిల్ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగ్గొట్టింది -న్యూయార్క్స్ టైమ్స్
ఎలక్ట్రానిక్ గాడ్గెట్ల దిగ్గజం ‘యాపిల్’ ప్రపంచ వ్యాపితంగా చిన్న చిన్న ఆఫీసులు నెలకొల్పి బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగవేసిందని ది న్యూయార్క్స్ టైమ్స్ శనివారం వెల్లడించింది. కాలిఫోర్నియా కంపెనీ అయిన ‘యాపిల్’ నెవాడా రాష్ట్రంలోని రెనో నగరంలో ఆఫీసు పెట్టడం పన్ను ఎగవేతకు వేసిన ఎత్తుగడల్లో ఒకటని ఆ పత్రిక తెలిపింది. నెవాడాలో కార్పొరేట్ పన్ను సున్నా శాతం కాగా కాలిఫోర్నియాలో 8.84 శాతం కార్పొరేట్ పన్ను వసూలు చేస్తారని తెలిపింది. రెనో ఆఫీసు లాంటివి…



