ఛత్తీస్ ఘడ్ కలెక్టర్ విడుదలకు ప్రభుత్వము, మావోయిస్టుల ఒప్పందం

మావోయిస్టు గెరిల్లాల చేత కిడ్నాప్ కి గురయిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జిల్లా కలెక్టర్ అలెక్స్ మీనన్ విడుదలకోసం మావోయిస్టు ప్రతినిధులకూ, ప్రభుత్వ ప్రతినిధులకు ఒప్పందం కుదిరినట్లు ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఒప్పందానికి మావోయిస్టు పార్టీ ఆమోద ముద్ర వేయాల్సి ఉండని తెలుస్తోంది. శనివారం ఒప్పందాన్ని మావోయిస్టులకు సమర్పించనున్నారు. “ఇప్పటికీ చర్చలు పూర్తయ్యాయి. కానీ అంతిమ ఒప్పందాన్ని మావోయిస్టులు ఆమోదించాల్సి ఉంది” అని మావోయిస్టుల తరపున చర్చల్లో పాల్గొంటున్న బి.డి.శర్మ తెలిపాడు. ఒప్పందం వివరాలు తెలపడానికి…

క్లుప్తంగా… 27.04.2012

ఇరాన్ అణు బాంబు కి సాక్ష్యం లేదు –పెనెట్టా ఇరాన్ ‘అణు బాంబు’ నిర్మిస్తోందని ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ దొరకలేదని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా అన్నాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఇరానియన్లు అణుబాంబు తయారీకి నిర్ణయించినట్లు నిర్ధిష్ట సమాచారం ఏదీ నా వద్ద లేదు” అని పెనెట్టా అన్నాడు. చిలీ రక్షణ మంత్రితో సమావేశం అయిన అనంతరం విలేఖరులతో పెనెట్టా మాట్లాడాడు. ఇరాన్ అణు బాంబుకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు ఒత్తిడి…

అవినీతి కేసులో బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దోషి -సి.బి.ఐ కోర్టు

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ…

మాంద్యం (recession) లో స్పెయిన్

డబుల్ డీప్ రిసెషన్ జాబితాలో స్పెయిన్ కూడా చేరింది. 2012 మొదటి క్వార్టర్ లో స్పెయిన్ జి.డి.పి క్షీణించింది. 2011 చివరి క్వార్టర్ లో కూడా స్పెయిన్ జి.డి.పి తగ్గుదల నమోదు చేయడంతో స్పెయిన్ కూడా మాంద్యం లో ఉన్నట్లయింది. రెండు క్వార్టర్లు వరుసగా ప్రతికూల వృద్ధి నమోదు చేసినట్లయితే అలాంటి ఆర్ధిక వ్యవస్ధ గల దేశం మాంద్యం ఎదుర్కొంటున్నట్లుగా పరిగణిస్తారు. 2008 నాటి సుదీర్ఘ మాంద్యం నుండి కోలుకోక మునుపే రెండవ సారి రిసెషన్ లోకి…

బుద్ధిలేనితనం, అత్యాశ, నిర్లక్ష్యం… ఇవే ఆర్ధిక సంక్షోభాలకు కారణం -గీధనర్

బుద్ధిలేనితనం (stupidity), అత్యాశ (greed), నిర్లక్ష్యం (recklesness) వల్లనే ఆర్ధిక సంక్షోభాలు సంభవిస్తున్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ప్రమాదాలను అవలీలగా తీసుకోవడం తగదని హెచ్చరించాడు. మోసాలనూ, చట్టాల దుర్వినియోగాన్నీ అడ్డుకోవడానికి కఠినమైన చట్టాలు తప్పనిసరని గీధనర్ నొక్కి చెప్పాడు. పోర్ట్ లాండ్ సిటీ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గీధనర్ బుధవారం ఈ మాటలన్నాడు. వాల్ స్ట్రీట్ లోని బడా బడా ద్రవ్య కంపెనీలు లాభాల పేరాశతో ప్రమాదకరమైన…