క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

‘కోర్టు ధిక్కారం’ కేసులో పాక్ ప్రధాని దోషి, 30 సెకన్లు జైలు

పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పై ‘కోర్టు ధిక్కారం’ నేరం రుజువయిందని పాకిస్ధాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నేరం రుజువయినప్పటికీ ‘సంకేతాత్మక’ శిక్షతో ప్రధానిని కోర్టు వదిలిపెట్టింది. ఆయనపై జైలు శిక్ష గానీ, మరొక శిక్షగానీ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించలేదు. గిలానీ ప్రధాని పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా తెలుస్తోంది. మాజీ మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ పాలనలో అధ్యక్షుడు జర్దారీతో పాటు అనేకమంది రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసుల్లో ముషార్రఫ్ క్షమా…

రాజ్య సభకు ‘సచిన్ టెండూల్కర్’?

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న కాంగ్రెస్ పార్టీ ‘సచిన్ టెండూల్కర్’ ను రాజ్య సభ సభ్యత్వానికి ప్రతిపాదించిందని ‘ఐ.బి.ఎన్ లైవ్’ పత్రిక తెలిపింది. సచిన్ ఇంకా ఏ సంగతీ చెప్పలేదని తెలుస్తోంది. సచిన్ నుండి స్పందన కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్య సభ సభ్యత్వం స్వీకరించడానికి సచిన్ అంగీకరించకపోవచ్చని కూడా పత్రికలు రాస్తున్నాయి. సంచిన్ వైపు నుండి అధికారికంగా ఏ సమాచారమూ లేదు. సచిన్ టెండూల్కర్ ని రాష్ట్ర ప్రతి కోటాలో…

ఫెయిలయినందుకు టీచర్లందరినీ నిర్భంధించిన XI క్లాస్ విద్యార్ధులు

పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో క్లాస్ XI సంవత్సరాంత పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్ధులు టీచర్లందరినీ స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. తమని క్లాస్ XII కు ప్రమోట్ చేశామని చెబితే తప్ప విడుదల చేయబోమని పట్టుపట్టారు. దాదాపు తొంభై మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో ఉండడంతో జోక్యం చేసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారు. స్కూల్ సెక్రటరీ కూడా నిర్బంధించబడివనారిలో ఉండడం విశేషం. గోపీబల్లభ్ పూర్ లోని ‘నయబాసన్ జనకళ్యాణ్ విద్యాపీఠ్’ అనే పాఠశాలలో గురువారం…