అధికారం కోసం కుమ్ములాటలో ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు సమాధి

ఈజిప్టు ప్రజలు మరోసారి వీధుల కెక్కారు. చరిత్రాత్మక తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం నుండి వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మే 23 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో అనేకమందిని ‘అనర్హులు’ గా ప్రకటించడం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి తాజా కారణంగా నిలిచింది. ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని నియంత్రణలో ఉంచుకున్న ‘ప్రభుత్వేతర సంస్ధలు’ (ఎన్.జి.ఓ) నిరసనలలో ముఖ్య పాత్ర నిర్వహించడం కొనసాగుతోంది. నిన్నటి వరకూ మిలట్రీ పాలకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలలో…

అమెరికా సీక్రెట్ సర్వీస్ స్కాండల్ -మరిన్ని కార్టూన్లు

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అంగరక్షకులు తమ బాస్ రక్షణ కోసం కొలంబియా వెళ్లి ఎస్కార్ట్ మహిళలతో దొరికిపోయిన అంశం ఒబామా ఎన్నికల ప్రచారంలో పంటికింద రాయిలో తగులుతోంది. వివిధ వర్గాల ప్రముఖులు, ప్రజలు ఒబామా భద్రతాధికారుల ప్రవర్తన పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అధ్యక్షుడు ఒబామాకి ఈ వ్యవహారం ప్రతికూలంగా పని చేస్తుందని కూడా భావిస్తున్నారు. ఒబామా ఎన్నికపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడే తలియదు గానీ రాజకీయ కార్టూనిస్టులు మాత్రం వచ్చిన…

Saving Taxpayers money

ఖజానాపై భారం తగ్గించిన ఒబామా భద్రతాధికారులు! -కార్టూన్

కొలంబియాలో ఒబామా భద్రత కోసం వెళ్ళిన భద్రతా సిబ్బంది పన్నెండు మంది ‘ఎస్కార్ట్’ మహిళలతో ఉండగా దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ కాన్ఫరెన్స్ కోసం కొలంబియా లోని కార్టిజీనా నగరానికి కొద్ది రోజుల క్రితం ఒబామా వెళ్ళివచ్చాడు. స్ధానిక క్లబ్ లో తాగి అక్కడే మహిళలతో బేరం కుదుర్చుకుని తాము బస చేసిన హోటల్ కి తీసుకెళ్లారు. $800 ఇస్తానని చెప్పి ఉదయాన్నే $30 మాత్రమే ఇవ్వజూపడంతో ఒక మహిళ…

పొలాల్లో కూలిన పాక్ విమానం, 127 మంది దుర్మరణం

పాకిస్ధాన్ లో పాసింజర్ జెట్ విమానం ఒకటి పొలాల్లో కూలిపోయింది. అందులో ఉన్న సిబ్బందితో సహా ప్రయాణికులంతా దుర్మరణం పాలయ్యారని డాన్ పత్రిక తెలిపింది. పాక్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముఖర్ మొత్తం 127 మంది మరణించారని ధృవీకరించినట్లుగా ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది. భోజా ఎయిర్ జెట్ శుక్రవారం కరాచీ నుండి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి ప్రయాణిస్తుండగా విమానాశ్రయానికి కొద్ది కిలో మీటర్ల దూరంలో సరిగ్గా ల్యాండ్ అవడానికి సిద్ధపడుతుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది.…