‘కాబూల్ దాడి’ సూత్ర ధారి పాకిస్ధానీ ‘హకానీ నెట్ వర్క్’

ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం ఉదయం వరకూ కొనసాగిన ‘కాబూల్ దాడి’ నిర్వహించింది పాకిస్ధాన్ కి చెందిన ‘హక్కానీ గ్రూపు’ అని అసోసియేటేడ్ ప్రెస్ తెలిపింది. కాబూల్ తో పాటు మరో మూడు ఆఫ్ఘన్ నగరాలపైన దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లు ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ‘దురాక్రమణకు తాలిబాన్ ప్రతిఘటన బలహీన పడిందని ఫిబ్రవరిలో వ్యాఖ్యానించిన అమెరికాకి తమ అంచనా తప్పని తెలియజేయడానికే ఈ దాడులకు పాల్పడ్డామని తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా తెలిపాడు. తమ ‘వేసవి దాడులకు’…

‘కట్నపిశాచి’ వద్దకి రానందని మహిళను చితక బాదిన పోలీసులు

పోలీసు గూండాయిజానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. భర్త కట్న దాహాన్ని తీర్చలేక ప్రొఫెసర్ ని శరణు వేడిన మహిళను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కట్న పిశాచికి అప్పగించడానికి ప్రయత్నించారు. మహిళను తీసుకెళ్లడానికి మహిళా పోలీసులను వినియోగించాలన్న చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించారు. రాష్ట్ర సరిహద్దుని దాటి మరీ పైశాచికత్వం ప్రదర్షించారు. తమ ఆధీనంలో ఉన్న మహిళను కొడుతున్నప్పటికీ మౌన ప్రేక్షకులుగా మిగిలినందుకు, స్ధానిక జిల్లా ఎస్.పి, ఒక ఎస్.ఐ తో సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాడు. మహిళ…

ఆఫ్ఘన్ మహిళ ‘షంషియా’ వీధి చిత్రాలు -ఫొటోలు

‘కళా రంగం’ పై తీవ్ర అణచివేత ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో ఒక మహిళ వీధి చిత్రాలు గీయడానికి పూనుకోవడం సాహసమే. కాబూల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన షంషియాని హస్సాని (24) ఆమె మిత్రుడు ఫౌషంజి హస్సాని (25) లు గీసిన చిత్రాలివి. మెయిన్ రోడ్లపక్కన ఉన్న గోడలపై గీయడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వాధికారులు అంగీకరించలేదు. దానితో ముప్ఫై యేళ్ల యుద్ధాల్లో శిధిలమైన భవనాల్లో లోపలి గోడలే వారి కళా తృష్ణకు సాధనాలయ్యాయి. తామే ఫొటోలు తీసి పత్రికలకు…