మురికి కాలవలో అప్పుడే పుట్టిన బాలిక

ఇది రాజస్ధాన్ లో జరిగిన ఘోరం. అప్పుడే పుట్టిన బాలిక మురికి కాలవలో ప్రత్యక్షమైంది. పొద్దున్నే చేసే వ్యాయామంలో భాగంగా నడుస్తూ అటుగా వచ్చినవారు పాప ఏడుపు విని పోలీసులకు చెప్పడంతో పాప బతికిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఒక ఎన్.జి.ఓ సంస్ధ ముందుకు వచ్చి పాపని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్ధాన్ రాజధాని జైపూర్ కి 300 కి.మీ దూరంలో ఉన్న ఉదయ్ పూర్ నగరంలో జరిగిందీ ఘటన. శనివారం ఉదయం జాగింగ్…

కాబూల్ లో పశ్చిమ దేశాల ఎంబసీలపై తాలిబాన్ బహుముఖ దాడులు

పశ్చిమ దేశాల దురాక్రమణ లో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ ఆదివారం మరోసారి విరుచుకుపడింది. రాజధాని కాబూల్ లో దుర్భేద్యంగా భావించే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంపై బహుముఖ దాడులకి దిగింది. పశ్చిమ కాబూల్ లోని పార్లమెంటు భవనం వద్ద పెద్ద ఎత్తున పేలుళ్ళు వినబడుతున్నాయనీ, జర్మనీ, బ్రిటన్, నాటో లకు చెందిన ఎంబసీలపై అనేక వైపుల నుండి మిలిటెంట్లు కాల్పులు సాగిస్తున్నారనీ, రాకెట్లు ప్రయోగిస్తున్నారనీ బి.బి.సి తెలిపింది. దాడులకు తామే బాధ్యులమని తాలిబాన్ ప్రతినిధి తెలిపాడని ఆ…