కొరియా స్లమ్ డాగ్ సింగర్ -వీడియో

చొయి సంగ్ బాంగ్. ఇప్పుడొక ఇంటర్నేషనల్ సెన్సేషన్. ‘కొరియాస్ గాట్ టాలెంట్’ షో లో అద్బుత ప్రతిభ కనబరిచి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయిన యువకుడు. నైట్ క్లబ్ లో పాటలు విని స్ఫూర్తి పొంది తనకు తాను పాడడం నేర్చుకున్నాడు. కష్టం చేసి సంపాదించిన డబ్బుతో అప్పుడప్పుడూ మ్యూజిక్ క్లాసులకు హాజరయ్యి తన ప్రతిభకు సాన పెట్టుకున్నాడు. టాలెంట్ షో లో ఫైనల్స్ చేరుకుని రెండవ స్ధానం సంపాదించాడు. అనాధగా తీవ్ర కష్టాల్లో పెరిగిన నేపధ్యం ఉన్నప్పటికీ…

పెయింట్ వార్

జర్మనీలో స్కేటింగ్ హోళీ(?) -వీడియో

చూడబోతే వీళ్లకి మన హోళీ పండగే స్ఫూర్తి లాగుంది. ఎక్కడంటే అక్కడ స్కేటింగ్ చేసేస్తూ అందులో రంగుల్ని మిళితం చేశారు. నిజానికి ఇక్కడ స్కేటింగ్ అన్నది అప్రధానం. రంగుల హోళీ యే ప్రధానం. ఒంటి నిండా పొడి రంగులు నిలవ చేసుకుని ఎత్తు పల్లాల దగ్గర స్కేటింగ్ చేయడం ద్వారా ఆ రంగుల్ని గాలిలోకి వెదజల్లుతూ హోళీని స్ఫురింప జేశారు. వీరు చేస్తున్నది హోళీయో కాదో తెలియదు గానీ మనకు తెలిసింది అదే గనుక ‘హోళీ’ అనే…

తీస్తా సెతల్వాద్ పై తప్పుడు కేసు ఆపండి, మోడీ ప్రభుత్వంతో సుప్రీం

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆధ్వర్యంలో ముస్లిం లపై జరిపిన అమానుష ‘హత్యాకాండ’ లో దోషులకి శిక్ష పడడానికి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తీస్తా సేతల్వాద్ పై మోడీ ప్రభుత్వం పెట్టిన కేసు ‘తప్పుడు కేసు’ అనీ, ‘మానవ హక్కులను’ తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదనీ సుప్రీం కోర్టు మరో సారి తేల్చి చెప్పింది. ఆమె పై పెట్టిన ‘తప్పుడు కేసు’ లో జరుపుతున్న పరిశోధనను ఆపేయాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అటార్నీని కోరింది. అయితే ఇప్పటికే కేసులో చార్జి…

SRK at yale university

అమెరికా పొగరు: మరోసారి షారుఖ్ నిర్బంధం

అమెరికా తన పొగరు మరోసారి లోకానికి చాటుకుంది. రెండేళ్లలో రెండవ సారి షారుఖ్ ఖాన్ ను రెండు గంటలపాటు డిటెన్షన్ లోకి తీసుకుని ప్రశ్నించింది. షారుఖ్ ని పిలిచిన యేల్ యూనివర్సిటీ విద్యార్ధులు చెప్పాక, తమ కంప్యూటర్లు ఆయన పేరును ‘ఫ్లాగ్’ చేయడం వల్ల పొరబాటు దొర్లిందని న్యూయార్క్ ఎయిర్ పోర్టు అధికారులు తీరిగ్గా ‘అపాలజీ’ చెప్పారు. ఇలాంటి పోరాబాట్లు పదే పదే చేసి ఆనక ‘ఆపాలజీ’ చెప్పడం అమెరికాకి యాంత్రిక అలవాటుగా మారిందని భారత విదేశాంగ…

ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

భారత అత్యున్నత న్యాయ స్ధానం చారిత్రాత్మ తీర్పు ప్రకటించింది. ప్రవేటు పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2009 లో యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్.టి.ఇ (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. పాతిక శాతం సీట్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన తమ ప్రాధమిక హక్కులకు భంగకరమన్న ప్రవేటు పాఠశాల వాదనను తిరస్కరించింది. ఉచిత నిర్భంధ విద్య భారత దేశ పిల్లలందరికీ ఉన్న ప్రాధమిక హక్కు…