సెక్స్ వ్యాపారంలో వాల్ స్ట్రీట్ కంపెనీ ‘గోల్డ్ మేన్’ పెట్టుబడులు

గోల్డ్ మేన్ సాచ్ అమెరికాలో అతి పెద్ద వాల్ స్ట్రీట్ కంపెనీ. పేరు మోసిన ఆన్ లైన్ సెక్స్ పత్రికలో ఈ కంపెనీకి పెట్టుబడులున్నాయని ‘న్యూయార్క్స్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. తన క్లయింట్లను తానే మోసం చేస్తున్నదంటూ గోల్డ్ మ్యాన్ సాచ్ కంపెనీ యూరప్ విభాగం ఉపాధ్యక్షుడు కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశాడు. అది మరుపులోకి జారకముందే అమ్మాయిలతో వ్యాపారం చేసే కంపెనీలో సైతం ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి కావడం అమెరికా ప్రజలని…

అజరబైజాన్ ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం లీక్ చేసిన అమెరికా

తన ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలు అభివృద్ధి కావడం ఇష్టం అమెరికాకి ఇష్టం లేకపోవడమే, అజరబైజాన్ తో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని లీక్ చేయడానికి కారణం అని రష్యా టైమ్స్ పత్రిక తెలిపింది. ఇరాన్ అణు కర్మాగారాలపై బాంబులు వేసి ధ్వంసం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ ఉత్సాహం తన పుట్టి పుంచుతుందని అమెరికాకి భయం. దురాక్రమణ యుద్ధాలు, ప్రభుత్వాల కూల్చివేతలు అమెరికాకి కొత్తేమీ కాదు. కాకపోతే కాస్త సమయం తీసుకుందామన్నదే అమెరికా అభిప్రాయం. ఇజ్రాయెల్…

మియాన్మార్ జన జీవనం -ఫొటోలు

మియాన్మార్ (బర్మా) గురించిన వివరాలు ఇన్నాళ్ళూ పెద్దగా ప్రపంచానికి తెలియదు. విదేశీ పత్రికలపై ఉన్న ఆంక్షలు అందుకు కారణం కావచ్చు. గత డిసెంబర్ నుండి అక్కడి ప్రభుత్వం కొన్ని రాజకీయ సంస్కరణలు చేపట్టింది. వాటిలో భాగంగా గృహ నిర్భంధం నుండి ప్రజాస్వామ్య ఉద్యమ నేత ‘ఆంగ్ సాన్ సూక్యీ’ ని విడుదల చేసింది. వివిధ కారణాలతో పార్లమెంటులో ఏర్పడిన ఖాళీలను నింపడానికి జరిపిన ఉప ఎన్నికల్లో సూక్యీ పార్టీ ‘ఎన్.ఎల్.డి’ ని పోటీ చేయడానికి అనుమతించింది. ఎన్నికల…

Myanmar elections

మియాన్మార్ ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ గెలుపు -కార్టూన్

మియాన్మార్ ఉప ఎన్నికల్లో ‘ఆంగ్ సాన్ సూక్యీ’ పార్టీ ఎన్.ఎల్.డి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) విజయ దుందుభి మోగించిందని పత్రికలు రాస్తున్నాయి. ఇంకా ఫలితాలు వెల్లడికాకపోయినా, కౌంటింగ్ కేంద్ర్రాల నుండి వస్తున్న సమాచారం ద్వారా, ఎన్నికలు జరిగిన నలభై ఐదు స్ధానాల్నీ ఆ పార్టీ గెలుచుకోబోతున్నట్లు తెలిసిందని అవి రాస్తున్నాయి. మియాన్మార్ మిలట్రీ పాలకులపైన ఉన్న వ్యతిరేకతా, సూక్యీ కి ఉన్న పరపతిని దృష్టిలొ పెట్టుకున్నపుడు ఆ వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించేవి కావు. ఇన్నాళ్ళూ…