అమెరికా, ఇ.యు వాణిజ్య బెదిరింపులను సాహసోపేతంగా తిప్పికొడుతున్న అర్జెంటీనా

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల ఆధిపత్య వాణిజ్య విధానాలను తిప్పికొట్టడంలో అర్జెంటీనా సాహసోపేతంగా వ్యవహరిస్తోంది. తమ దేశ ప్రయోజనాలను బలి పెట్టే విధంగా విదేశీ ఒత్తిడులకు తల వంచేది లేదని అమెరికా, ఇ.యు లకు చేతల ద్వారా స్పష్టం చేస్తోంది. డబ్ల్యూ.టి.ఓ వద్ద అమెరికా, ఇ.యు లు చేస్తున్న తప్పుడు ఫిర్యాదులకు బెదిరేది లేదని తెగేసి చెబుతోంది. అర్జెంటీనా వాణిజ్య విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా, ఇ.యు లు డబ్ల్యూ.టి.ఓ లో ఆదివారం ఫిర్యాదు…

సిరియా తరలి వెళ్ళిన రష్యా యుద్ధ నౌక ‘డిస్ట్రాయర్’

రష్యన్ నేవీ కి చెందిన యుద్ధ నౌక సిరియా ఓడ రేవు కి బయలుదేరినట్లు రష్యా మిలట్రీ అధికారులు తెలిపారు. గత వారాంతంలో నల్ల సముద్రంలోని సేవాస్టోపోల్  స్ధావరాన్ని డిస్ట్రాయర్ వదిలి వెళ్లిందని వారు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని సిరియా ఓడరేవు ‘టార్టస్’ కు అది మరి కొద్ది రోజుల్లో చేరుకుంటుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ‘మిలట్రీ డ్రిల్లు’ లో ‘డిస్ట్రాయర్’ పాల్గొంటుందని రష్యా మిలట్రీ ని ఉటంకిస్తూ ‘డి డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది. సిరియాలో…

ఆఫ్ఘన్ లో మరో హెలికాప్టర్ కూల్చివేత, 14 మంది అమెరికా సైనికుల మరణం

ఆఫ్ఘన్ మిలిటెంట్లు మరొక అమెరికా హెలికాప్టర్ ని కూల్చివేసినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. తూర్పు ఆఫ్ఘన్ రాష్ట్రం ఘజని లోని అందర్ జిల్లాలో అమెరికా హెలికాప్టర్ ని కూల్చి వేసినట్లు తాలిబాన్ మిలిటెంట్లను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. హెలికాప్టర్ లో ఉన్న 14 మంది అమెరికా సైనికులు చనిపోయారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పాడు. హెలికాప్టర్ కూల్చివేతపై నాటో దళాల నుండి ఇంకా సమాచారం ఏదీ అందలేదని ప్రెస్ టి.వి తెలిపింది. 82 ఎం.ఎం…

రికార్డు స్ధాయికి యూరో జోన్ నిరుద్యోగం, డబుల్ డిప్ నిర్ధారణ?

ఫిబ్రవరి నెలలో 17 దేశాల యూరో జోన్ నిరుద్యోగం అత్యధికంగా 10.8 శాతానికి చేరుకుంది. 1999 లో ‘యూరో’ ఉమ్మడి కరెన్సీగా యూరో జోన్ ఏర్పాడ్డాక ఇదే అత్యధిక స్ధాయి నిరుద్యోగం. జనవరి నెలలో యూరో జోన్ 10.6 శాతం నిరుద్యోగం నమోదు చేసింది. యూరో జోన్ దేశాల్లోలో స్పెయిన్ అత్యధికంగా 23.6 శాతం నిరుద్యోగంతో అగ్రస్ధానంలో ఉంది. మూడేళ్ళ క్రితం సంభవించిన ‘ది గ్రేట్ రిసెషన్’ నుండి పూర్తిగా కోలుకోక ముందే యూరప్, మరోసారి మాంద్యంలోకి…

Teen killed

రు. 50 వేల కోసం క్లాస్ మేట్ ని హత్య చేసిన టెన్త్ విద్యార్ధులు

విలాసాల ఖర్చుల కోసం పదో తరగతి విద్యార్ధులు తమ క్లాస్ మేట్ ని కిడ్నాప్ చేసి హత్య చేసిన దారుణం పూణె లో చోటు చేసుకుంది. క్లాస్ మేట్ తల్లిదండ్రులకు గర్భ శోకం మిగల్చడమే కాక తమ తల్లిదండ్రులను సైతం సమాజంలో తలెత్తుకోనీకుండా చేసిన విద్యార్ధులు తమకు టి.వి సీరియళ్ళు స్ఫూర్తినిచ్చాయని పోలీసులకి చెప్పారు. టి.వి సీరియళ్ళే తమకు దారి చూపాయని విద్యార్ధులు తమ విచారణలో చెప్పినట్లుగా పోలీసు అధికారులు చెప్పారు. శుభం షిర్కే పూనె లో…

Tatra trucks deal - General's attack

టాట్రా అవినీతి, ఆర్మీ చీఫ్ అటాక్ -కార్టూన్

టాట్రా ట్రక్కుల కొనుగోలుకోసం రు.14 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపించిన ఆర్మీ ఛీఫ్ వి.కె.సింగ్ ఆరోపణ చేసినపుడు పేరు చెప్పలేదు. ఇప్పుడు సి.బి.ఐ కి ఫిర్యాదు చేస్తూ తనకు లంచం ఇవ్వబోయిన వ్యక్తి ‘లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్’ అని స్పష్టం చేసాడు. (తేజీందర్ సింగ్ ఇప్పటికే వి.కె.సింగ్ పై పరువు నష్టం దావా వేశాడు) తన తదనంతరం ఆర్మీ ఛీఫ్ కానున్నవారిలో రెండవ స్ధానంలో ఉన్న బల్వీందర్ సింగ్ పైన సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సంగతి…