భారత ప్రయాణీకుల ఉమ్మడి ఆత్మ ‘భారత రైల్వే’ -ఫొటోలు

‘ఇండియన్ రైల్వేస్’ కి భారత దేశ ప్రయాణీకుల అంతరంగంలో ఉత్కృష్ట స్ధానం ఉంది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ లక్షల కొద్దీ పల్లెలనూ, పట్నాలనూ కలుపుతూ వ్యాపించిన భారత రైల్వేలు లేకుండా భారతీయుడికి రోజు గడవదు. భారత దేశంలో ప్రజలకు జీవనాడిగా ఉన్న వేల కొద్దీ వృత్తులూ, ఉద్యోగాలూ ఏదో ఒక రూపంలో రైల్వేలతో సంబంధం లేకుండా లేవు. అది ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం ఐనా, ప్రవేటు కంపెనీ సమకూర్చిన ఉద్యోగం అయినా, స్వయం ఉపాధి అయినా……

‘మందుపాతర’కు ప్రతీకారమే ‘ఆఫ్ఘన్ హత్యాకాండ’

ఆఫ్ఘనిస్ధాన్ ప్రజల అత్యాధ్మిక రాజధాని కాందహార్ సమీపాన అమెరికా సైనికులు రెండు గ్రామాల్లో (బలాంది, అల్కోజాయ్), మూడు ఇళ్ళల్లో జొరబడి 16 మంది పౌరులను చంపింది మతి భ్రమించి కాదని, హత్యాకాండకు కొద్ది రోజుల ముందు అమెరికా సైనిక కాన్వాయ్ పైన తాలిబాన్ ప్రయోగించిన మందుపాతర’ కు ప్రతీకారమేనని రాయిటర్స్ వార్తా సంస్ధ కధనం వెల్లడించింది. ఆ కధనం ఇలా ఉంది. DEMAND FOR TRIAL in AFGHANISTAN The U.S. military hopes to withdraw…

ఛార్జీలు పెంచిన రైల్వే బడ్జెట్ 2012-13

కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఛార్జీలు పెంచడానికే నిర్ణయింకుకున్నాడు. 2012 ఏప్రిల్ నెల నుండి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను మార్చి 14, బుధవారం ఆయన రైల్వే బడ్జెట్ ప్రవేవేశపెట్టాడు. కొద్దిగానే పెంచానని మంత్రి చెబుతున్నప్పటికీ పెంచినవన్నీ ప్రయాణీకులపై భారం పడవేసేవే. రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వ, ప్రవేటు వేతన జీవుల నిజ వేతనాలు బాగా పడిపోయినందున ఎంత పెంచినా ప్రయాణీకుల జేబుకు ఇప్పటికే ఉన్న చిల్లుల్ని పెద్దవి చేసేవే. కిలో మీటరుకి…

సునిశిత హాస్యం ఈ గీతల సొంతం -స్ట్రీట్ ఆర్ట్ ఫొటోలు

ఈ వీధి చిత్రాల్లో కళాకారులు పెద్దగా కష్ట పడినట్లు కనిపించదు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని గీతలనీ, రోజువారీ ఉపయోగం కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నిర్మాణాలనూ, ఉపకరణాలనూ ఆధారం చేసుకుని వారు అర్ధవంతమైన చిత్రాలు రాబట్టారు. తరచుగా ఈ చిత్రాల్లో కేవలం కొన్ని గీతలో, కొంత పాఠ్యమో, మహా అయితే రోజూ చూసే చిన్న చిన్న బొమ్మలో కనిపిస్తాయంతే. ఇలాంటి వీధి చిత్రాలు సృష్టించడంలో బ్యాంక్సీ (ఇంగ్లండ్) సిద్ధహస్తుడు. ఓక్ ఓక్ (ఫ్రాన్సు) కూడా. వీరద్దరు…

2011 జనాభా లెక్కలు: 63% ఫోన్లున్నా, 53% టాయిలెట్లు లేవు

2011 జనాభా లెక్కల వివరాలు దశలవారీగా వెల్లడవుతున్నాయి. దేశంలో మొత్తం 24.67 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 16.78 కోట్ల కుటుంబాలు గ్రామాల్లోనూ, 7.88 కోట్ల కుటుంబాలు పట్టణాల్లో నివసిస్తున్నారని ఈ లెక్కల్లో వెల్లయింది. ఆమ్టే 68.03 శాతం మంది గ్రామాల్లో నివశిస్తుంటే, 31.97 శాతం మంది పట్నాల్లో నివసిస్తున్నారన్నమాట. భారత దేశానికి ఇంకా పల్లెలే పట్టుగొమ్మలుగా ఉన్నాయని ఈ లెక్కలు సూచిస్తున్నాయి. భారత దేశంలో అత్యధికులకి కనీస సౌకర్యాలు ఇంకా అందుబాటులో లేవని కూడా ఈ…