యుద్ధాలు శా(శ్వా)సించేవారు రాజనీతిజ్ఞులు, యుద్ధం చేసే సైనికులు పిచ్చోళ్ళు?!

ఆఫ్ఘనిస్ధాన్ లో అమాయక పౌరుల ఇళ్ళల్లో జొరబడి నిద్రలో ఉన్న 16 మంది ని కాల్చి చంపిన అమెరికా సైనికుడు వాషింగ్టన్ రాష్ట్రంలోని టకోమా వద్దగల ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి వచ్చాడు. ఈ స్ధావరాన్ని ‘లూయిస్ మెక్-కార్డ్’ బేస్ గా పిలుస్తారు. ఈ స్ధావరం నుండి వచ్చిన సైనికులు గతంలో కూడా ఇలాంటి హత్యాకాండలకి పాల్పడ్డారనీ, అసలా స్ధావరంలోనే ఏదో ఉందనీ పశ్చిమ దేశాల పత్రికలు కధనాలు రాస్తున్నాయి. 2010 లో కూడా…

European Union -Tracks never meet

యూరోపియన్ యూనియన్, యూరోజోన్: ఎన్నడూ కలవలేని పట్టాలు -కార్టూన్

యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటున్న రుణ సంక్షోభం ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరిస్ధితిని ఈ కార్టూన్ సూచిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) దాని సభ్య దేశాల మధ్య రాజకీయ ఐక్యతను సూచించే సంస్ధ కాగా, యూరో జోన్ (ఇ.జెడ్) సంస్ధ దాని సభ్య దేశాల కోశాగార ఐక్యత (ఫిస్కల్ యూనిటీ) ని సూచించే సంస్ధ. ఇ.యులో 27 సభ దేశాలు ఉన్నాయి. వీటిలో 17 దేశాలు మాత్రమే ‘యూరో’ ను తమ ఉమ్మడి…

మరో హత్యా కాండ, ఈ సారి సిరియాలో

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోసిన రెండవ రోజే సిరియాలో పౌరుల ఊచకోత జరిగింది. సిరియాలో జొరబడి సంవత్సర కాలంగా అద్దె తిరుగుబాటు నడుపుతున్న పశ్చిమ దేశాల కిరాయి మూకలు తాజాగా ఈ హత్యా కాండకు పాల్పడ్డాయని సిరియా ప్రభూత్వ మీడియాను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షుడు కోఫీ అన్నన్ సిరియా సందర్శిస్తున్న సందర్భంలో ఆయనను ప్రభావితం చేయడానికే విదేశీ కిరాయి మూకలు ఈ హత్యాకాండకి దిగాయని సిరియా…