ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్

‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది. “అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన …

యు.పి ఎన్నికల్లో సైకిల్ హవా -కార్టూన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు గల్లంతు కాగా ప్రతిపక్షం లో ఉన్న పార్టీలు అధికారం దిశలో పయనిస్తున్నాయి. మణి పూర్ పంజాబ్ లలో మాత్రం కాంగ్రెస్, బి.జె.పి కూటమి తిరిగి నిలబెట్టుకునే వైపుగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తగా చూస్తే యు.పి.ఏ, ఎన్.డి.ఏ రెండు కూటములకూ నిరాశ కలిగించేవిగానే ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. గాంధీల కంచుకోటలుగా భావించే అమేధీ, రాయబరేలలోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు వెనకబడి ఉన్నారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో అధికార బి.ఎస్.పి…