ఎరువుల రేట్ల తగ్గుదల రైతుకి చేరకుండా నోక్కేసిన కేంద్ర ప్రభుత్వం

అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల రైతుకీ చేరకుండా కేంద్ర ప్రభుత్వం నోక్కేసింది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కంపెనీలకు నష్టం వస్తోందంటూ పెంచే ప్రభుత్వం అవి తగ్గినపుడు మాత్రం, ఆ తగ్గుదలను ప్రజలకు అందకుండా తానే నోక్కేస్తుంది. అదే పద్ధతిని ఎరువుల విషయంలో కూడా అనుసరించడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎరువల ధరలను చాలా కాలం క్రితమే ప్రభుత్వం డీ కంట్రోల్ చేసింది. దానివల్ల ఎరువుల ధరలు సాధారణ రైరులకు అందనంత ఎత్తులో…

అమెరికా-తాలిబాన్ చర్చలు, ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తున్న అమెరికా

తాలిబాన్ తో జరుగుతున్న చర్చల్లో అమెరికా ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తుండగా, తమ సుప్రీం నాయకుడి కోసం ‘రాజ్యాంగ హోదా’ కావాలని తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. గ్వ్యాంటనామో బే లో ఖైదీగా ఉన్న తమ నాయకులను, కమాండర్లనూ విడుదల చేయాలనీ, కీలు బొమ్మ కర్జాయ్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందేననీ తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. ఋణ సంక్షోభం, మళ్ళీ రిసెషన్ లోకి జారిపోతుందేమోనని భయపెడుతున్న ఆర్ధిక వ్యవస్ధ, నిరుద్యోగం లాంటి సమస్యలతో సతమతమవుతున్న అమెరికా,…

‘భోపాల్ గ్యాస్ లీక్’ ఉద్యమం పై నిఘా పెట్టిన ‘డౌ కెమికల్స్’

భోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు నష్ట పరిహారం కోసం పోరాడుతున్న సంస్ధలపైన అమెరికా కంపెనీ ‘డౌ కెమికల్స్’ అనేక సంవత్సరాలుగా నిఘా పెట్టిన సంగతి వెల్లడయ్యింది. అమెరికాలో టెక్సాస్ లో ఉన్న ‘స్ట్రాట్ ఫర్’ అనే ప్రవేటు డిటెక్టివ్ కంపెనీని ఇందుకు వినియోగించినట్లుగా వెల్లడ్యింది. ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ ‘స్ట్రాట్ ఫర్’ కి సంబంధించిన 5.5 మిలియన్ల (55 లక్షలు) ఈ మెయిళ్ళు వికీ లీక్స్ కు అందడంతో స్ట్రాస్ ఫర్ పాల్పడిన పాపాల పుట్ట బద్దలయింది.…