కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు

రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…

కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం

తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి…

అరగంటకోసారి విశ్రాంతి కోరే పని అది, పదేళ్ళుగా సెలవే లేదు

భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోనే వాజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో గల అనేక స్టీల్ ప్లాంట్లలో పదేళ్ళుగా సెలవన్నది తెలియకుండా పని చేస్తున్న కార్మికుల సంగతి వెలుగులోకి వచ్చింది. వారానికొక విశ్రాంతి దినం కోసం అక్కడి కార్మికులు స్వచ్ఛందగా సమ్మెకు దిగడంతోనే ఇప్పటికైనా వారి దుస్థితి వెలుగులోకి వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత మొదటిసారిగా వాజీర్ పూర్ స్టీల్ ప్లాంటుల కార్మికులు బుధవారం రోజు (ఫిబ్రవరి 29) వారాంతపు సెలవు దినాన్ని పొందనున్నారు. ఆ రోజు వారు…