రెండేళ్ళ పాపని కొట్టి, గోడకి బాది…
ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ట్రౌమా సెంటర్ లో రెండేళ్ళ పాప ‘ఫాలక్’ కధ విన్న ఎవరికైనా హృదయం చలించక మానదు. రెండు చేతుల్లోనూ ఎముకలు చిట్లి, నేరుగా మెదడుకే గాయాలై, కపాలం ఫ్రాక్చరై, వొంటినిండా కొరికిన గాట్లతో ఉన్న ‘ఫాలక్’ని పది రోజుల క్రితం మరో పదిహేనేళ్ల పాప ‘మహి గుప్త’, జనవరి 18న ‘తానే తల్లి’ నంటూ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చింది. మంచం పైనుండి కింద పడిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ లో జారి పడిందనీ విభిన్న కధనాలు…

