ఈ స్పామ్ కామెంట్స్ లక్ష్యం ఏంటి?

ఇక్కడ మూడు స్క్రీన్ షాట్స్ ఇవ్వబడ్డాయి. ఇవి వ్యాఖ్యలుగా ఈ బ్లాగ్ లో పోస్ట్ అయ్యాయి. ఈ స్పాం కామెంట్లకు లక్ష్యం పట్ల నాకు కొన్ని అనుమానాలు తలెత్తడం వల్ల బహిరంగం చేయడం జరుగుతోంది. మొదటి రెండు స్క్రీన్ షాట్లలో చూస్తే ఆ వ్యాఖ్యలకు అర్ధం లేనట్లు తెలుస్తూనే ఉంది. మూడో స్క్రీన్ షాట్ లో చివరి వ్యాఖ్య మిగత వ్యాఖ్యలకు భిన్నంగా ఉంది. ఈ వ్యాఖ్య, గురు గోల్వాల్కర్ బోధనలను ఉటంకిస్తూ రాసిన పోస్టు కింద…

గడ్డాఫీ లాబీయిస్టుల చేతిలో లిబియా పట్టణం

గడ్డాఫీ అనుకూలురు పశ్చిమ లిబియాలోని ముఖ్య పట్టణం ‘బాని వాలిద్’ ను సోమవారం సాయంత్రం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గడ్డాఫీని హత్య చేసిన తిరుగుబాటు ప్రభుత్వం ఎన్.టి.సి కి చెందిన స్ధానిక కమాండర్ ఒకరు ఈ విషయం తెలిపినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. మూడు నెలల క్రితం లిబియా మాజీ అధ్యక్షుడు గడ్డాఫీ, ఆయన ప్రభుత్వంలోని అనేకమందిని చంపిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ బలగాలు లిబియాని తమకు అనుకూలురైన ఎన్.టి.సి (నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్) ని అధికారంలో…