అనుకోని ఉపద్రవం వస్తే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకునేది ఓ వారమే

ఇప్పటికిప్పుడు అనుకోని ఉపద్రవం వచ్చిపడితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకుని నిలిచేది కేవలం ఆ వారం రోజులేనని ఓ అధ్యయన సంస్ధ తేల్చిపారేసింది. ఓ పెద్ద ప్రకృతి విలయం లేదా మిలిటెంట్ల దాడి (9/11 దాడుల్లాంటివి కావచ్చు) వస్తే గనక అటువంటి వాటిని తట్టుకుని సుదీర్ఘ కాలం నిలవ గల శక్తి ఇప్పటి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు లేదని ఆ సంస్ధ తేల్చింది. 2010 లో ఐస్ లాండ్ అగ్ని పర్వతం పేలుడుతో ఎగజిమ్మిన బూడిద మేఘాలుగా…

శిల్పారామం ఫొటోలు

ఇవి తెలుగు బ్లాగర్ సుజాత గారు తీసిన ఫొటోలు.  హైద్రాబాద్ లో శిల్పారాం కు నేనెప్పుడూ వెళ్లలేదు. ఈ ఫొటోలు చూసి ధ్రిల్లయ్యాను. ఫొటోలనైనా సొంతం చేసుకుందామని నా బ్లాగ్ లో పోస్టు చేసుకుంటున్నా. అసలు పోస్టు ఇక్కడ చూడండి.

ప్రవీణ్! మీరు మారాలి

ప్రవీణ్ గారికి ఇది నా బహిరంగ లేఖ. ఇది సలహా, విన్నపం, కోరిక ఎలా తీసుకున్న ఫర్వాలేదు. గత రెండు రోజులుగా నా బ్లాగ్ లో కొన్ని అంశాలపై చర్చ జరుగుతోంది. నా బ్లాగ్ లో ఉంచుతున్న బూతు వ్యాఖ్యాతల ఐ.పి లను బహిరంగ పరుస్తూ నేను రాసిన టపాకు పెద్దలు, మిత్రులు, విజ్ఞులు స్పందించారు. చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. (అందరికీ కృతజ్ఞతలు) అందరూ కాకపోయినా కొందరైనా బ్లాగుల్లో బూతుల్ని ఖండించారు. చర్చకు…

ఐదంతస్ధుల ఎత్తులో ‘అవర్ లేడీ ఆఫ్ గ్రేస్’ -ఫొటో

ఇదో వీధి బొమ్మ. ఐదంతస్ధుల ఎత్తు గల ఓ భవంతి గోడపైన గీసిన బొమ్మ ఇది. ఎ’షాప్ అనే సంస్ధకు చెందిన ఐదుగురు ఆర్టిస్టులు పదహారు రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ చిత్రాన్ని గీయడం అక్టోబరు 20 న పూర్తి చేశారు. కెనడా లోని క్వెబెక్ రాష్ట్రంలో అతి పెద్ద నగరమైన మాంట్రియల్ లో ఈ బొమ్మ గీసారు.  ఈ బొమ్మ గీయడానికి కావలసిన సరంజామా సమకూర్చుకోవడానికి రెండు వారాలు పరిశోధన చేశామని ఆర్టిస్టులు చెప్పారు. ఏ…