మరో భారతీయ విద్యార్ధి హత్య, ఈసారి కెనడాలో

బ్రిటన్ లో అనిల్ బిద్వే హత్యకు గురైన కొన్ని రోజులకే మరో భారతీయ విద్యార్ధి హత్యకు గురయ్యాడు. ఈసారి వంతు కెనడా తీసుకుంది. ఇరవే యేడేళ్ళ ‘అలోక్ గుప్తా’ కెనడాలో తుపాకితో కాల్చి చంపబడ్డాడు. పశ్చిమ కెనడాలో సర్రే నగరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఒక స్టోర్ యజమానులు అందరూ కలిసి క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడానికి వీలుగా అలోక్ గుప్తా మధ్యాహ్నం షిఫ్టు పని…

లోక్‌పాల్ బిల్లుకి187 సవరణలా!? ఆమోదనీయం కాదు -చిదంబరం

ఒకటి రెండు సవరణలైతే ఆమోదించవచ్చనీ, రాజ్యసభలో ఏకంగా నూట ఎనభై ఏడు సవరణలు లోక్ పాల్ బిల్లుకి ప్రతిపాదించడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం శనివారం వ్యాఖ్యానించాడు. మిత్రుల మద్దతు పొందడానికి ఒకటి రెండు సవరణలు బిల్లుకి చేయవచ్చనీ చిదంబరం తెలిపాడు. “లోక్ పాల్ బిల్లుని మెరుగుపరిచి పురర్నిర్వచించవలసిన అవసరం రావచ్చు. రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి సంబంధించినంతవరకూ ఒకటి రెండు సవరణలను అనుమతించవచ్చు. ఒకటి రెండు సవరణలు చేసినా అదే బిల్లు…

‘ధానె’ పెను తుఫాను విధ్వంసం -ఫొటోలు

ధానె పెను తుఫాను ముప్ఫై మూడు మందిని బలిగొంది. పుదుచ్చేరి, కడలూరు, చెన్నై లలో విధ్వంసం సృష్టించింది. విధ్వంసం తాలూకు ఫొటోలను ‘ది హిందూ’ అందించింది. – –

యూరప్ 2012? -కార్టూన్

2012లో యూరప్ ఎలా ఉండబోతోంది? గ్రీసు తో ప్రారంభమై బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీలను సైతం తాకుతుందేమో అని భయపడుతున్న ‘యూరప్ రుణ సంక్షొభం’ ఏయే దేశాలను బలి గోరుతున్నది? రుణ సంక్షోభం విస్తరణ వల్ల యూరప్ జిడిపి వృద్ధి రేటు ఇంకా పడిపోతే అక్కడికి ఎతుమతులు చేసే ఇండియా, చైనాల ఆర్ధిక వ్యవస్ధలు ఎలా ప్రభావితం కానున్నాయి? ఇప్పటికే జిడిపి వృద్ధి క్షీణించిపోయిన భారత ఆర్ధిక వ్యవస్ధపైన యూరప్ రుణ సంక్షోభం మరింత తీవ్రంగా ప్రభావితం చేయనున్నదా?…