‘భగవద్గీత’ నిషేధానికి రష్యా కోర్టు నిరాకరణ

భారత ప్రభుత్వం రాయబార పరంగా తెచ్చిన ఒత్తిడి ఫలించిందో ఏమో గానీ ‘భగవద్గీత’ అనువాద గ్రంధం నిషేధానికి రష్యాలోని సైబీరియా కోర్టు నిరాకరించిందని పి.టి.ఐ వార్తా సంస్ధను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. సైబీరియాలోని టామ్స్క్ జిల్లా కోర్టులో గత జూన్ నెలలో ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని పి.టి.ఐ నివేదించింది. గత కొన్ని వారాలుగా ఈ అంశంపై రష్యా, భారత్ ల మధ్య రాయబార పరమైన ఒత్తిడి కొనసాగుతూ వచ్చింది. పార్లమెంటులో సైతం…

కాంగ్రెస్ ఎం.పిల గైర్హాజరుతో లోక్‌పాల్ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి

కాంగ్రెస్ పార్టీ ఎం.పి లు గణనీయ సంఖ్యలో పార్లమెంటుకు హాజరు కాకపోవడంతో లోక్ పాల్ బిల్లుకి రాజ్యాంగ హోదా కల్పించే ‘రాజ్యాంగ సవరణ బిల్లు’ ఓటమికి గురయింది. గైర్హాజరైన కాంగ్రెస్ సభ్యుల జాబితా ఇవ్వాలని సోనియా గాంధి కోరడంతో గైర్హాజరైన సభ్యులపై కాంగ్రెస్ హైకమాండ్ చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు. మూజు వాణీ ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు బుధవారం రాజ్య సభలో ఓటింగ్ కి రానున్న నేపధ్యంలో రాజ్యసభలో మెజారిటీ సంపాదించడానికి…

ముంబై తో పాటు ఢిల్లీ కూడా విస్మరించిన ‘అన్నా పిలుపు’

‘పటిష్టమైన లోక్ పాల్ బిల్లు’ తేవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్నా ఇచ్చిన ఆందోళన పిలుపును ఈసారి ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. గతంతో పోలిస్తే ప్రజలు ఆన్నా ఆందోళనకు అంత తీవ్రంగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందాక తమ ఆందోళన ఎన్నికల సంస్కరణలపై కేంద్రీకరిస్తుందని ప్రకటించిన అన్నా బృందం, అప్పటికి ఎంతమంది ప్రజలను ఆకర్షించగలుగుతారన్నదీ ఇపుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వం తలపెట్టిన ‘బలహీన’ లోక్ పాల్ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన జరపాలని…

‘పాంచజన్యం’ (బంచ్ ఆఫ్ ధాట్స్) పుస్తకానికి ‘పరిచయం’ ఇది

భారత దేశంలో ముస్లింల విషయంలో ఆర్.ఎస్.ఎస్ సంస్ధ భావాల గురించి చెబుతూ నేను గురు గోల్వాల్కర్ రచించిన పుస్తకం ‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ నుండి నేను కొన్ని అంశాలను ఉటంకించాను. అయితే, ఆ పుస్తకం ప్రతి ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ వెబ్ సైట్ లో కూడా లేదనీ, సామాన్య పాఠకులెవరికీ అందుబాటులో లేదనీ అవన్నీ ఇప్పుడు అవసరమా అని మిత్రులు కొందరు ప్రశ్నిస్తున్నారు. గురు గోల్వాల్కర్ కి సంబంధించిన ఆ భావాలు ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ స్వీకరించడం…