నివసించడానికి గూడు లేని అమెరికా -ఫొటోలు

అమెరికాలో నివసించడానికి ఇల్లు లేని పిల్లలు పెరుగుతున్నారని రాయిటర్స్ తెలిపింది. దాదాపు పదహారు లక్షల మంది పిల్లలు ఇలా ఇల్లు లేక హోం లెస్ షెల్టర్లలో, హోటళ్ళలో, కార్లలో, వీధి పక్కనా, సబ్ వేలలో నివసిస్తున్నారని ఓ సంస్ధ చేసిన సర్వేని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఇల్లులేని పిల్లల సంఖ్య 2007తో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగిందని సర్వే తెలిపింది. మూడేళ్ల క్రితం అమెరికాను చుట్టుముట్టిన మాంద్యం నుండి ప్రభుత్వ బెయిలౌట్లు మేసిన కంపెనీలు బైటపడ్డాయి…

యు.పి, ఉత్తర ఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాల ఎన్నికల తేదీల ప్రకటన

కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల తేదీలు ప్రకటించింది. తద్వారా మినీ సాధారణ ఎన్నికలకు తెరతీసింది. రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసింది. వ్యాహాలు, ప్రతి వ్యూహాలకు బదులుగా రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం, స్నేహాలు, బంధుత్వాలు, శతృత్వాలు… ఇలా అందుబాటులో ఉన్నవాటన్నింటినీ ఉపయోగించుకునేందుకు ఇక సిద్ధం కానున్నాయి. రాష్ట్రం సీట్లు ఎన్ని విడతలు ఎప్పుడు? కౌంటింగ్   ఉత్తర ప్రదేశ్        403       7…

సామాజిక గెంటివేత -వీధి శిల్పకళ(?) ఫొటోలు

స్వీడన్ లోని గోతెన్ బర్గ్ పట్టణంలో తీసిన ఫొటోలివి. మేగ్నస్ వాల్ స్ట్రామ్ అనే ఫొటోగ్రాఫర్ పంపిన ఫోటోలుగా ‘స్ట్రీట్ ఆర్ట్ యుటోపియా” తెలిపింది.   – –

సునామీలో కొట్టుకుపోయి, ఏడేళ్ళ తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన బాలిక

ఏడేళ్ళ క్రితం బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలలో సంభవించిన సునామి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎక్కడో ఇండోనేషియా ద్వీపకల్పానికి దగ్గరగా సముద్రం లోపల 9.1 రీడింగ్ తో సంభవించిన శక్తివంతమైన భూకంపంతో ఈ రెండు సముద్రాలలో సునామి ఏర్పడి మొత్తం ఏడు దేశాలలో విలయం సృష్టించించిన సంగతి విదితమే. మొత్తం రెండు లక్షల ముప్ఫై వేలకు పైగా ప్రజలు చనిపోయిన ఈ సునామి ప్రభావం ప్రజలపై ఇంకా చూపుతుండడమే విషాధం. ఏడేళ్ళక్రితం, ఎనిమిదేళ్ళ వయసులో…

అమోఘం, అద్భుతం, అసంభవం -వీధి చిత్రం ఫొటో

మై గుడ్ నెస్! ఈ వీధి చిత్ర కళాకారుల ప్రతిభకు అంతం లేనట్లుంది. వీధి చిత్రంగా భావించడానికి కూడా అసాధ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని గీసింది మాయా క్లిల్, ఇమూమ్ కోలి అని తెలుస్తోంది. వారీ ఊరు తెలియలేదు. ఫేస్ బుక్ పేజీ ఉన్నా అందులో వివరాలు లేవు. – –

అమెరికాతో ఘర్షణ నేపధ్యంలో పాకిస్ధాన్ కి పూర్తి మద్దతు హామీ ఇచ్చిన చైనా

దక్షిణాసియాలో అమెరికాకు చిరకాల మిత్ర దేశంగా ఉన్న పాకిస్ధాన్ కి అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపధ్యంలో ఆ దేశానికి చైనా నుండి పూర్తి మద్దతు లభించింది. ఆర్ధిక, రక్షణ తదితర రంగాలన్నింటిలోనూ చైనా పాకిస్ధాన్ కి పూర్తి మద్దతుగా నిలుస్తుందని పాకిస్ధాన్ పర్యటిస్తున్న చైనా అత్యున్నత విదేశాంగ శాఖ అధికారి హామి ఇచ్చినట్లుగా ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది. చైనా ప్రభుత్వ కౌన్సిలర్ దాయి బింగ్-గువో, తన పాక్ పర్యటన పాక్, చైనా సంబంధాలను మరింత ఉన్నత స్ధాయికి…

హమీద్ కర్జాయ్ వల్ల వెనక్కి వెళ్ళిన అమెరికా-తాలిబాన్ ఒప్పందం

అమెరికా, తాలిబాన్ ల మధ్య ఒప్పందం కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. చివరి నిమిషంలో ఒప్పందంలోని అంశాలకు హమీద కర్జాయ్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం సాధ్యం కాలేదని ఆ పత్రిక తెలిపింది. ఈ ఒప్పందం ఫలితంగా గ్వాంటనామో బే జైలు లో  నిర్బంధంలో ఉన్న ఐదుగురు తాలిబాన్ నాయకులను అమెరికా విడుదల చేయవలసి ఉంటుంది. అందుకు బదులుగా తాలిబాన్ బహిరంగంగా టెర్రరిజాన్ని వదులుకోవడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. హమీద్ కర్జాయ్ అభ్యంతర…

ఫేస్ బుక్, గూగుల్ తదితర ఐ.టి సంస్ధలపై ఫిర్యాదులు స్వీకరించిన భారత కోర్టులు

అభ్యంతరకర సమాచారాన్ని తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన భారత కోర్టులు అమెరికాకి చెందిన ఐ.టి సంస్ధలకు నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్, యాహూ, గూగుల్ లాంటి పందొమ్మిది ఐ.టి సంస్ధలు కోర్టునుండి నోటీసులు అందుకున్న సంస్ధల జాబితాలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన రెండు కోర్టులు మతపరంగా ప్రజలను గాయపరిచేవిగా ఉన్న సమాచారాన్ని వెంటనే తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. ఢిల్లీలోని ఒక కోర్టు,…