‘హిందూ సంస్కృతిని ఆచరించండి లేదా హిందూ జాతికి బానిసలు కండి” -ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్

(రష్యాలో భగవద్గీతపై నిషేధానికి సంబధించి నేను రాసిన పోస్టు కింద ఓ మిత్రుడు చేసిన వ్యాఖ్యకు ఈ పోస్టు సమాధానం గా గ్రహించగలరు) గోల్వార్కర్ ఆర్.ఎస్.ఎస్ కి రెండవ గురువు అన్న సంగతి విదితమే. హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ స్ధాపించినప్పటికీ గోల్వార్కర్ నేతృత్వంలో ఆర్.ఎస్.ఎస్ భావాజాలం అభివృద్ధి చెందిందని అందరూ అంగీకరిస్తారు. భారత దేశంలో ముస్లింల భవిష్యత్ పై ఆర్.ఎస్.ఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నదీ గురు గోల్వార్కర్ మాటల్లోనే తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది. “వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్…

‘టీం అన్నా’ ఆందోళనను ను తూర్పారబట్టిన బోంబే హై కోర్టు

టీం అన్నా శుక్రవారం అనూహ్య రీతిలో బోంబే హై కోర్టు నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. తమ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమే అని గట్టిగా నమ్ముతున్న టీం అన్నా బృందానికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “మీ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమేనని కోర్టు నిర్ణయించలేదు. మీరు జరుపుతున్న ఆందోళన మీకు ‘సత్యగ్రహం’ కావచ్చు. ఇతరులకు అది ‘న్యూసెన్సు’ కావచ్చు” అని కోర్టు అన్నా బృందం వాదనలను తిరస్కరించింది. బోంబే హైకోర్టు వ్యాఖ్యలు అన్నా బృందానికి…

పాక్ చెక్‌పోస్టు దాడిపై అమెరికా నివేదికను తిరస్కరించిన పాక్ సైన్యం

నవంబరు చివరి వారంలో ఆఫ్-పాక్ సరిహద్దులో గల పాకిస్ధాన్ చెక్ పోస్టులపై అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడిలో ఇరవై నాలుగు మంది పాక్ సైనికులు చనిపోయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఉన్నత స్ధాయిలో దర్యాప్తు జరుపుతామని అమెరికా, నాటోలు హామీ ఇచ్చాయి. సదరు దర్యాప్తు నివేదికను అమెరికా పూర్తి చేసింది. ఈ నివేదికను పాకిస్ధాన్ సైన్యం తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. పాక్, అమెరికాలు ఇరువైపులా జరిగిన తప్పుల వలన పాక్ సైనికుల పెద్ద సంఖ్యలో…