‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అని మాత్రమే “కారల్ మార్క్స్” అన్నాడా?

“మతం ప్రజల పాలిట మత్తు మందు” అని కారల్ మార్క్స్ అన్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఒక్కటి మాత్రమే మార్క్సు అని ఊరుకున్నాడా? లేదు. ఆయన మతానికి మత పెద్దలు కూడా ఇవ్వలేని విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని కారల్ మార్క్స్ నిర్వచించాడు. ప్రజల దృక్పధంలోనుండి మతాన్ని ఎలా నిర్వచించవచ్చో, నిజానికి, మత సూత్రాలలో ఉద్దండ పండితులెవ్వరికైనా తెలిసి ఉంటుందని భావించలేము. వారంతా మతాన్ని దేవుడి దృక్పధంలో నుండి, మత పండితుల…

పాకిస్ధాన్ ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర -ప్రధాని గిలాని

దేశంలో ఏ సంస్ధ కూడా రాజ్యంలో మరొక రాజ్యంగా ఉండజాలదని పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ బుధవారం హెచ్చరించాడు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కుట్రలు జరుగుతున్నాయని గిలానీ ఆందోళన వ్యక్తం చేసాడు. పాక్ ప్రధాని గిలాని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కొద్ది వారాల క్రితం అధ్యక్షుడు జర్దారీ, అమెరికా ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కి రాశాడని భావిస్తున్న మెమో లోని అంశాలను ధృవ పరచడం గమనార్హం. అమెరికా…

ఇరాక్ విధ్వంసంతో అమెరికా సంతృప్తి, అందుకే సైన్యం ఉపసంహరణ -కార్టూన్

దాదాపు ఎనిమిదేళ్ళకు పైగా ఇరాక్ లో అమెరికా సైన్యం తిష్ట వేసింది. ఒక దేశాన్ని, ఒక ప్రజా సమూహాన్ని ఎన్నిరకాలుగా విధ్వంసం చేయవచ్చో అన్ని రకాలుగానూ ఇరాక్ ను అది విధ్వంసం కావించింది. ప్రజల నిత్యజీవనానికి అవసరమైన మౌలిక నిర్మాణాలన్నింటినీ -రోడ్లు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సౌకర్యం, రైలు మార్గాలు, ఆయిల్ పైప్ లైన్లు, ఆయిల్ సరఫరా మార్గాలు మొ॥వి౦- సర్వనాశనం చేసింది. తాను స్ధాపిస్తానన్న ప్రజాస్వామ్యం ఊసుని పూర్తిగా విస్మరించింది. ప్రశాంతంగా బతుకుతున్న ఇరాకీయుల మధ్య, జాతి,…

‘నితిన్ గార్గ్’ హంతకుడికి 13 సం.ల శిక్ష వేసిన ఆస్ట్రేలియా కోర్టు

గత సంవత్సరం ఆస్ట్రేలియాలో హత్యకు గురయిన భారతీయుడు ‘నితిన్ గార్గ్’ హంతకుడికి ఆస్ట్రేలియా పదమూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో జాతి వివక్ష ఏమీ లేదని కోర్టు నిర్ధారించింది. కేవలం మొబైల్ ఫోన్ కోసమే ఈ హత్య జరిగినట్లుగా కోర్టు తేల్చివేసింది. హత్య చేసే ఉద్దేశ్యం హంతకుడికి లేదనీ, అసలు తాను కత్తితో నితిన్ గార్గ్ ను పొడిచిందీ లేనిదీ కూడా హంతకుడికి తెలియదనీ, అంతా ఒక నిమిష లోపలే జరిగిపోయిందనీ కోర్టు నిర్ధారించింది. నితిన్…