అవినీతి ‘రాజా’ కొంప ముంచిన పర్సనల్ సెక్రటరీ ‘ఆచారి’

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన ‘ఆచారి’, తన మాజీ బాస్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి వార్తా సంస్ధ తెలిపింది. ఎ.ఆచారి గతంలొ ఎ. రాజాకు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోర్టులో సోమవారం మాజీ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఎ.రాజాకు, ఆయన కుట్ర పన్నాడని ఆరొపిస్తున్న కంపెనీల అధిపతులతో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తద్వారా ఎ.రాజా టెలికం…

కొత్త సంవత్సరంలో యూరప్ సంక్షోభం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది -యూరప్ సెంట్రల్ బ్యాంక్

యూరప్ రుణ సంక్షోభం కొత్త సంవత్సరంలో తన విశ్వరూప చూపిస్తుందనీ, అది ప్రపంచం అంతా వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచం అంతటికీ వ్యాపించడమే కాక సంక్షోభం మరింత తీవ్రం కానున్నదని వారు తెలిపారు. యూరప్ లో సంక్షోభంలో ఉన్న దేశాలకు సహాయ పడే నిమిత్తం ఐ.ఎం.ఎఫ్ కు నిధులు ఇవ్వడానికి బ్రిటన్ నిరాకరించడంతో ఈ పరిస్ధితి తలెత్తుతుందని అధికారులు తెలిపారు. ఐ.ఎం.ఎఫ్ కు బ్రిటన్ ఇరవై…

‘క్షిపణి’ లో(తో)నే ‘కిమ్ జోంగ్-ఇల్’ సమాధి!!! కార్టూన్

కిమ్ జోంగ్-ఇల్ నేతృత్వంలో ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం సంపాదించి అణ్వస్త్రాల నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగించింది. ఉత్తర కొరియా వద్ద నిజానికి అణ్వస్త్రాలు ఉన్నదీ లేనిదీ అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఉత్తర కొరియా అనేకసార్లు అణ్వస్త్ర పరీక్ష జరపడంతో ఆ దేశం వద్ద అణు బాంబులు ఉండవచ్చని పశ్చిమ దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాయి. ఇరాన్ లాగానే ఉత్తర కొరియాపైన కూడా అణ్వస్త్రాలను సాకుగా చూపుతూ అమెరికా, యూరప్ లు…

హోం మంత్రి చిదంబరం కు ‘సభా హక్కుల ఉల్లంఘన’ నోటీసు ఇవ్వనున్న బి.జె.పి

కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. లాయరు వృత్తిలో ఉన్నపుడు తన క్లయింటు పై దాఖలైన ఒక హోటల్ యజమానిపైన ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులను ఎత్తివేయాలని చిదంబరం సిఫారసు చేసాడని వెల్లడి కావడంతో చిదంబరం పై విచారణ జరపాలని బి.జె.పి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు లోక్ సభ, రాజ్య సభల్లో ప్రతిపక్షాలు ఒక పక్క ఆందోళన చేస్తుండగా చిదంబరం ఆ…

‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ‘క్షిపణి’ని పరీక్షించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా అత్యున్నత రాజకీయ, మిలట్రీ నాయకుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ చనిపోయిన రోజే ఆ దేశం స్వల్ప దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే శక్తి గల క్షిపణి పరీక్షించి సంచలన సృష్టించింది. అయితే మిసైల్ పరీక్ష కూ, కిమ్ మరణానికీ సంబంధం ఉన్నదని తాము భావించడం లేదని దక్షిణ కొరియా అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ సంస్ధ తెలిపింది. మిసైల్ పరీక్షించిన విషయాన్ని కూడా దక్షిణ కొరియా మీడియా నే వెల్లడించాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా…