‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో శోక సంద్రంలో ఉ.కొరియా ప్రజలు -ఫొటోలు

ఉత్తర కొరియాను పోలీసు రాజ్యంగా పశ్చిమ దేశాలు, అక్కడి పత్రికలు అభివర్ణిస్తుంటాయి. ఉత్తర కొరియాను ‘కిమ్ జోంగ్-ఇల్’ ఉక్కు గోడల మధ్య పాలిస్తున్నాడనీ, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడనీ ఆరోపిస్తాయి. ప్రజలను కఠినంగా అణిచివేస్తాడని ఆడిపోసుకుంటాయి. కాని కిమ్ మరణంతో ఉత్తర కొరియా ప్రజానికం మూకుమ్మడిగా విలపిస్తున్న దృశ్యాలు ఆ ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమేనని చెబుతున్నాయి. – –

చైనాకి భయాన్ని మిగిల్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడి మరణం?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ మరణం చైనాకు ఒకింత భయాన్ని మిగిల్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జోంగ్-ఇల్ మరణంతో తాము ‘ఆందోళనకూ, అసౌకర్యానికీ’ గురయినట్లుగా చైనా ప్రభుత్వం తెలిపింది. దీనిని నిజానికి ‘షాక్ కి గురయ్యామని’ చైనా చెప్పినట్లుగా భావించవచ్చని రాయిటర్స్ భాష్యం చెప్పింది. కొరియా ప్రాంతంలో చైనా ప్రభావానికి ఉత్తర కొరియా వాహకంగా ఉంటూ వచ్చింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఇల్ ఎంతగా చైనాను విసిగించినప్పటికీ, చైనా ఎంత విసిగినప్పటికీ ఆసియాలో, ఆ…

ఉత్తర కొరియా అధ్యక్షుడు ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణం, అప్రమత్తతలో పశ్చిమ దేశాలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ దేశ అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ గుండెపోటుతో మరణించినట్లుగా ప్రభుత్వం సోమవారం ప్రకటించినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది. అరవై తొమ్మిదేళ్ళ కిమ్ జోంగ్-ఇల్ శనివారమే మరణించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ‘ఫీల్డ్ గైడెన్స్’ ఇస్తుండగా అదనపు శారీరక, మానసిక శ్రమ వలన అలసటకు గురవడంతో కిమ్ మరణించాడని ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు మరణించడంతో పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి. అణ్వస్త్ర పరిజ్ఞానం ఉన్న ఉత్తర…