బాబా రాందేవ్ దీక్షా శిబిరంపై పోలీసు దాడికి చిదంబరమే బాధ్యుడు -సుప్రీం అమికస్ క్యూరి

విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలన్న డిమాండ్ తో బాబా రాందేవ్ ప్రారంభించిన నిరాహార దీక్షా శిబిరంపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి చేసిన దాడికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం బాధ్యుడని సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ నిర్ధారించాడు. రాందేవ్ నిరాహార దీక్ష శిబిరంపై పోలీసులు అమానుషంగా దాడి చేశారన్న వార్తలు పత్రికలలో రావడంతో సుప్రీం కోర్టు తనంతట తానే ఈ కేసును చేపట్టింది. అనంతరం కేసు విచారణలో తనకు సాయపడాలని కోరుతూ సుప్రీం కోర్టు, సీనియర్…

ఇరాక్ యుద్ధం ముగిసిందట! -ఫొటోలు

‘ఇరాక్ యుద్ధం’ ముగిసిందని డిసెంబరు 15 తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించాడు. ఇరాక్ లో తమ పని ముగిసిందనడానికి ప్రతీకగా అక్కడ అమెరికా పతాకాన్ని అవనతం చేశారు. రెండు నెలల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం ఎనిమిదేళ్ల పాటు ఎందుకు కొనసాగిందో అమెరికా నాయకులు ఇంతవరకూ వివరించలేదు. సామూహిక విధ్వంసక ఆయుధాలు లేవని తెలిసినా ఇరాక్ లో సైన్యాన్ని ఎందుకు కొనసాగించారో ఇంకా చెప్పలేదు. అమెరికా లెక్క ప్రకారమే లక్షమంది ఇరాక్ పౌరులను చంపిన అమెరికా నాయకులకు…

‘యూరో’ ను నిలబెట్టడానికి జర్మనీ, ఫ్రాన్సుల విఫల యత్నం -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం పుణ్యమాని యూరప్ ఐక్యత కు ప్రమాదం ముంచుకొచ్చింది. గత రెండేళ్ళనుండీ యూరో జోన్ దేశాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ‘యూరప్ రుణ సంక్షోభం’ నిత్య యవ్వనంతో శోభిల్లుతోంది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకి బాటలు వేసిన లిస్బన్ ఒప్పందం లో మార్పులు చేయడానికి గత శుక్రవారం జరిగిన ఇ.యు శిఖరాగ్ర సమావేశం నిర్ణయించగా బ్రిటన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరవే ఏడు దేశాల్లో బ్రిటన్ ప్రస్తుతం ఏకాకిగా ఉన్నా భవిష్యత్తులో దానికి మద్దతు…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి సెన్సెక్స్ పతనం

బోంబే స్టాక్ ఎక్చేంజి సెన్సెక్స్ సూచి శుక్రవారం రెండున్నర శాతం పతనం అయింది. మొత్తంగా రెండేళ్లలోనే అత్యంత కనిష్ట స్ధాయికి చేరుకుంది. బ్యాంకింగ్, మెటల్స్, సాఫ్ట్ వేర్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసిందని విశ్లేషకులు, ట్రేడర్లు విశ్లేషించారని రాయిటర్స్ తెలిపింది. బ్యాంకుల షేర్లు, ఫ్యూచర్లు బాగా పతనం అయ్యాయనీ, ఆర్.బి.ఐ పరపతి విధానం సమీక్షతో నిరుత్సాహపడిన మదుపుదారులు అమ్మకాలకు పాల్పడ్డారని వారు చెబుతున్నారు. శుక్రవారం రిజర్వ్…

‘పాపులిస్టు ముసుగు’ చించుకుని బైటికి వచ్చిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని బైట పెట్టుకున్నాడు. తాను ఇస్తున్న పాపులిస్టు నినాదాలు నిజానికి తన ముసుగు మాత్రమేననీ, వాస్తవంలో తన ఆలోచనలు ప్రజానుకూలం కాదని రుజువు చేసుకున్నాడు. దాదాపు నాలుగు కోట్ల కుటుంబాలను రోడ్లపాలు చేసే ‘రిటైల్ రంగంలో విదేశీ సూపర్ మార్కెట్ల’ నిర్ణయానికి బహిరంగంగా తన మద్దతు తెలిపాడు. రిటైల్ రంగంలో విదేశీ కంపెనీలు వస్తే రైతులకే లాభం అని నచ్చ జెప్పడానికి కూడా సిద్ధపడ్దాడు. బహిరంగంగా ప్రజలకు అబద్ధాలు చెప్పే రాజకీయ…

చీప్ లిక్కర్ మృతుల కుటుంబాల్లో అంతులేని విషాధం -ఫొటోలు

పశ్చిమ బెంగాల్, సంగ్రామ్ పూర్ గ్రామంలో విషపూరితమైన చీప్ లిక్కర్ తాగి మృతి చెందినవారి సంఖ్య 167 కి పెరిగింది. మృతులందరూ రిక్షా కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు, రోజు కూలీలే. వీరి మరణంతో వీరి సంపాదనపై ఆధారపడి ఉన్న కుటుంబాలు భవిష్యత్ ఎలా అని తల్లడిల్లుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ధనిక రోగులు చేరే ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారం,…