ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకున్న భారత ప్రభుత్వం

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం గతంలో వేసిన ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) అంచనాను తగ్గించుకుంది. పనిలో పనిగా ఈ సంవత్సరం కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్ లేదా బడ్జెట్ డెఫిసిట్) లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. “చెల్లింపుల సమతూకం” (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్) విషయంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నామని తెలిపింది. ‘చెల్లింపుల సమతూకం సంక్షోభం’ ఎన్నడో ఇరవై సంవత్సరాల క్రితం 1992 లో ఇండియా ఎదుర్కొంది.…

రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ ల నిర్ణయం సస్పెన్షన్ -కార్టూన్

విపక్షాలతో పాటు, స్వపక్షాలు కూడా రిటైల్ రంగంలో ఎఫ్.డీ.ఐ లు ఆహ్వానించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో మన్మోహన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. ఏకాభిప్రాయం సాధించి తిరిగి ప్రవేశపెడతానని పరోక్షంగా తెలిపింది. ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించేది లేదని చెబుతున్నాయి. బి.జె.పి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పని చేసిన కాలంలో రిటైల్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడుల్ని అంగీకరించాలని వాదించాడు. ఇప్పుడా పార్టీ యు-టర్న్ తీసుకున్నానని చెబుతోంది. చూద్దాం, ఎంతకాలమో! –…

జపాన్ లో మరో అణు ప్రమాదం, రేడియేషన్ నీరు లీకేజి

జపాన్ లో మరో అణు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వాయవ్య జపాన్ లో నెలకొల్పిన ఇక అణు విద్యుత్ కర్మాగారంలోపల రేడియెషన్ కలిసి ఉన్న నీరు లీక్ అవుతున్నట్లు కనుగొన్నారని తెలుస్తోంది. ఈ రేడియెషన్ లీకేజి అణు విద్యుత్ కర్మాగారం లోపలి వరకే పరిమితం అయిందనీ, ఇంకా వాతావరణంలోకి వెలువడలేదనీ తెలుస్తోంది. అయితే వాతావరణంలోకి రేడియేషన్ విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకున్నదీ లేనిదీ తెలియరాలేదు. వాయవ్య జపాన్ లో ఉన్న క్యుషు ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ (కెప్కో)…

అత్యాధునిక అమెరికా గూఢచారి విమానాన్ని నేలకూల్చిన ఇరాన్

అత్యాధునికమైన తన మానవ రహిత గూఢచార డ్రోన్ విమానాన్ని ఇరాన్ గగనతలంలో ఎగురుతూ గూఢచర్యానికి పాల్పడుతుండగా ఇరాన్ నేలకూల్చడంతో అమెరికా మింగలేక, కక్కలేక ఉంది. తన గూఢచర్య విమానాన్ని ఇరాన్ నేల కూల్చలేదనీ, దానంతట అదే కొన్ని సమస్యలు రావడం వలన కూలిపోయిందని చెప్పడానికి నానా తంటాలు పడుతోంది. ఆర్.క్యు – 170 గా పిలిచే ఈ గూఢచార డ్రోన్ విమానం అత్యంత ఆధునికమైనదనీ, అత్యంత ఎత్తునుండి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తుందని అంగీకరిస్తూనే దాన్ని ఇరాన్ కూల్చిందన్న…

అమెరికా కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది -ఒబామా

అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శుక్రవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో కొద్దిగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ అది శాశ్వతం కాదని ఆర్ధిక విశ్లెషకులు భావిస్తున్నారు. బారక్ ఒబామా అంచనా సైతం దాని ధృవీకరిస్తోంది. సిబి.ఎస్ టెలివిజన్ కి చెందిన “60 మినిట్స్” కార్యక్రమానికి ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం ఇచి ప్రసారం కానున్నది. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో సమస్యల పరిష్కారాన్ని తక్కువ…