ఇంగ్లండ్ వీధి చిత్రకారుడి కళ -ఫొటోలు

BANKSY (బేంక్సి) ప్రసిద్ధి చెందిన వీధి చిత్ర కళాకారుడు. ఈయన సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు. పెయింటర్ కూడా. ఇతని వీధి చిత్రాలు చాలా బాగుంటాయి. అందంగా, ఆలోచించేవిగా, వ్యంగ్యాత్మకంగా ఇలా చాలా రకాలుగా చిత్రాలు గీయగలడు. “షాప్ టిల్ యు డ్రాప్” అనే షాపు కోసం ఆయన ఆ షాపు గోడపైన గీసిన చిత్రం చూడండి. – –

ద్రవ్య సంక్షోభానికి చేరువలో ఇండియా

భారత దేశం ద్రవ్య సంక్షోభానికి చేరువలో ఉన్న విషయాన్ని ఆర్ధిక పరిశీలకులు పెద్దగా గమనిస్తున్నట్లు లేదు. రూపాయి విలువ పతనం రూపంలో భారత దేశం ద్రవ్య సంక్షోభం వ్యక్తమవుతున్నది. పైకి రూపాయి విలువ పతనమే ద్రవ్య సంక్షోభానికి కారణంగా కనిపిస్తున్నప్పటికీ భారత దేశ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాలే ఇండియాను ద్రవ్య సంక్షోభం వైపుకి నెడుతున్న విషయాన్ని గుర్తించవలసి ఉంది. 1991 లో రూపాయి విలువను రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు తగ్గించిన తర్వాత…

12 వ సంవత్సరంలోకి ప్రవేశించిన “ఇరోం షర్మిలా” నిరాహార దీక్ష

-రచన: డేవిడ్ ఉక్కు సంకల్పం ఆమె. మొక్కవోని మనో నిబ్బరం ఆమె. అత్మరవం నుంచి జనించిన ఆగ్రహం ఆమె. తల్లడిల్లుతున్న యుద్ధభుమిలో తపోదీక్ష చేస్తున్న శాంతికపోతం ఆమె. తుపాకి గొట్టాల విచ్చలవిడీ తనాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామిక గొంతు. నిరంకుశ చట్టాన్ని నిరసించిన నిప్పు కణిక. జాతికోసం జంగ్ చేస్తున్న జ్వలిత. అన్యాయంపై తిరగబడ్డ అగ్గిబరాట. శరీరాన్నే ఆయుధంగా మలుచుకున్న సాహస వనిత. పుష్కర కాలంగా అన్నపానియాలు ముట్టని అసలు సిసలు సత్యాగ్రహి. కన్నీళ్ళను, కష్టాలను కలబోసిన నెత్తుటి…

సృజనాత్మక నిఘా -వీడియో

ఇది ప్రవేటు నిఘా కన్ను. జనాన్ని తన వద్దకు ఆకర్షించి మరీ నిఘా వేస్తుంది ఈ కన్ను. న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ లోని మిల్టన్ స్ట్రీట్ లో ఉన్న ఈ నిఘా కన్ను పదంతస్ధుల ఎత్తులో వాటర్ ట్యాంకు కింది భాగంలో ఏర్పాటు చేశారు. తన పరిధిలో తాను చూడగల ప్రాంతంలో ఎవరు వస్తున్నదీ, ఎవరు పోతున్నదీ అన్నింటినీ ఇది రికార్డు చేస్తుంది. ప్రవేటు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతంలో నిఘా పెడుతున్నందుకు ప్రభుత్వం అభ్యంతరం…