రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ కి ఎదురుదెబ్బ, సాధారణ మెజారిటీతో సరిపుచ్చిన ఓటర్లు

గత దశాబ్దం పైగా రష్యాను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న వ్లాదిమిర్ పుతిన్ కు ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మూడింట రెండొంతుల మెజారిటీతో ఎదురు లేకుండా తమకు అవసరమైన ‘రాజ్యాంగం సవరణలు’ చేసుకుంటూ పాలించిన పుతిన్ పార్టీకి ఈసారి రష్యా ప్రజలు కేవలం సాధారణ మెజారిటీ మాత్రమే కట్టబెట్టారు. అంటే ఇక పుతిన్ పార్టీ ‘రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకునే’ వెసులుబాటును కోల్పోయిందన్నమాట. రాజ్యాంగానికి ఏమన్నా మార్పులు చేయదలుచుకుంటే ఇతర పార్టీలపై ఆధారపడవలసిందే.…

యురేనియంను ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -2

రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ దేశాల అధ్యక్షులు, ప్రధానులు వచ్చి అణు రియాక్టర్ల వ్యాపారం విషయమై ఇండియా తో చర్చించి వెళ్ళారు గానీ అమెరికా నుండి అణు రియాక్టర్ల అమ్మకానికి సంబంధించి ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దానికి కారణం కూడా ఇండియాపైనే మోపుతోంది. అణు రియాక్టర్లు, అణు పదార్ధాలు సరఫరా చేసే అమెరికా కంపెనీలు (జనరల్ ఎలక్ట్రిక్, తోషిబా, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్) నాసిరకం పరికరాలు సరఫరా చేసినందువలన గానీ, లోపాలతో కూడిన రియాక్టర్లు…

యురేనియం ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -1

భారత్ నూ, పాకిస్ధాన్ నూ సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను పాకిస్ధాన్ కోరింది. ఇండియాకు యురేనియం ఖనిజాన్ని అమ్మడానికి ఆస్ట్రేలియా పాలక లేబర్ పార్టీ ఆదివారం ఆమోదం తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పాకిస్ధాన్, తమను కూడా ఇండియాతో సమానంగా చూడాలని ఆస్ట్రేలియాను కోరింది. యురేనియం కొనుగోలు చేయడానికి తమను కూడా అనుమతించాలని కోరింది. అణు రియాక్టర్లలో యురేనియం ను ఇంధనంగా వాడతారన్నది తెలిసిందే. ప్రపంచంలోకెల్లా యురేనియం నిల్వలు ఆస్ట్రేలియాలో అధికంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా న్యూక్లియర్ సప్లయర్స్…

గ్రీన్ టెక్న్లాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం?

పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాణిజ్యంలో అమెరికా, చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన పర్యావరణ సాంకేతిక ఉత్పత్తులు అమెరికా కంపెనీల ఉత్పత్తులకు హానికరంగా పరిణమించాయని భావిస్తూ ‘అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్’ విచారణ చేయడానికి నిర్ణయించడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. అమెరికా చర్యలు వాణిజ్యంలో ‘రక్షణాత్మక విధానాలతో’ (ప్రొటెక్షనిజం) సమానమని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర దేశాలనుండి వచ్చే దిగుమతులతో పోటీ పడలేక అటువంటి దిగుమతులపైన పెద్ద…