పాక్ చెక్ పోస్టులపై దాడి మిలట్రీ ఆపరేషన్ లో భాగమే -అమెరికా

ఎట్టకేలకు అమెరికా మిలట్రీ అధికారి ద్వారా పాక్షికంగానైనా నిజం బైటకి వచ్చింది. ఆఫ్ఘన్, పాకిస్ధాన్ (ఆఫ్-పాక్) సరిహద్దులో పాక్ చెక్ పోస్టులపైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడి అమెరికా మిలట్రీ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని అమెరికా మిలట్రీ ప్రతినిధి, నేవీ కెప్టెన్ జాన్ కిర్బీ చెప్పినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోవడం పట్ల అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్ధాయి వర్గాలు ఇప్పటికే విచారం…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని కేంద్రం సస్పెండ్ చేసింది -మమత

రిటైల్ రంగంలో ‘విదేశీ పెట్టుబడుల’ నిర్ణయం శనివారం అనూహ్యంగా మలుపు తిరిగింది. సూపర్ మార్కెట్లలో 51 శాతం మేరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు ఆ విషయం తెలిపినట్లుగా మమతా బెనర్జీ విలేఖరులకు తెలిపింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఇప్పటివరకూ ఎటువంటి చర్చా జరగలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి రోజూ…

భోపాల్ గ్యాస్ లీక్ బాధితులపై పోలీసుల లాఠీ ఛార్జి

ఇరవై ఏడేళ్ల క్రితం జరిగిన భోపాల్ విష వాయువు లీక్ దుర్ఘటనకు సంబంధించిన బాధితులకు పూర్తి న్యాయం చేకూరాలని కోరుతూ దుర్ఘటన దినం డిసెంబరు 3 తేదీన బాధితులు చేసిన ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు. బాధితులకు న్యాయమైతే దక్కలేదు గానీ తమకు దక్కని న్యాయం కోసం ఆందోళన చేసే హక్కును కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణమంటూ సంఘటనను అనేకమంది ఖండించారు. 1984 డిసెంబరు 3 తేదీన భోపాల్ నగరంలో ఉన్న యూనియన్ కార్భైడ్ పురుగు మందుల ఫ్యాక్టరీ…

రూపాయి పతనం కాకుండా ఆర్.బి.ఐ చర్యలు తీసుకుంటుంది -ఆర్.బి.ఐ

ప్రభుత్వం, ఆర్.బి.ఐ లు రూపాయి పతనం పట్ల తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రూపాయి మరింత పతనం కాకుండా అడ్డుకోవడానికి ఆర్.బి.ఐ చేయవలసిందేదీ లేదనీ, ఆ అవసరం లేదని ఆర్.బి.ఐ ఇన్నాళ్లూ చెబుతో వచ్చింది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆర్.బి.ఐ జోక్యం వల్ల రూపాయి పతనం ఆగిపోయే అవకాశాలు లేవని చెబుతూ వచ్చాడు. శనివారం ఆర్.బి.ఐ స్వరం మారింది. రూపాయి విలువ ను స్ధిరంగా ఉంచడానికి అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యుటీ…

విదేశీ సూపర్ మార్కెట్లపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోంది. -అద్వాని

విదేశీ సూపర్ మార్కెట్ల వల్ల కలగనున్న లాభాలపై ప్రభుత్వం దేశాన్ని ఫూల్ చేస్తోందని ప్రతిపక్ష బి.జె.పి అగ్ర నాయకుదు ఎల్.కె.అద్వానీ శనివారం ఆరోపించాడు. “వాల్-మార్ట్ పశ్చిమ దేశాలకు మంచిది కావచ్చు. కాని వాల్-మార్ట్ మనకు సేవ చేసే సంస్ధ కాదు” అని అద్వాని పేర్కొన్నాడు. “మనం వాల్-మార్ట్ పట్ల అసూయ చెందకూడదు” అని న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ అద్వానీ చెప్పాడు. తద్వారా పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను అతిగా అనుకరించడంపైన హెచ్చరించాడు. నిజానికి బి.జె.పి…