కుల దురాచారంపై ఫిర్యాదు చేసిన బి.సి నాయకుడ్ని చితకబాదిన అగ్ర కులస్ధులు

కర్ణాటకలో కుక్కె సుబ్రమణ్య దేవాలయంలో ఇప్పటికీ అమలులో ఉన్న కుల దురాచారానికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బి.సిల నాయకుడిని చావబాదిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల రక్షణలో ఉన్నప్పటికీ ఆయనకు చావు దెబ్బలు తప్పలేదు. ఆయన చేసిన పాపమల్లా ‘మాదె స్నాన’ అన్న పేరుతో సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న దురాచారాన్ని ఆపాలని కోరడమే. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుబ్రమణ్య గుడి మంగుళూరు దగ్గరలో ఉన్న సుల్యా తాలూకాలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజుల…

నరేంద్ర మోడికి మరో లెంపకాయ, ‘ఇష్రాత్ జహాన్’ బూటకపు ఎన్‌కౌంటర్ పై సిబిఐ విచారణ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కి వరుసగా లెంపకాయలు తగులుతూనే ఉన్నాయి. అయనకు లెంపకాయలు ఇచ్చినవాళ్ళలో తాజాగా గుజరాత్ హై కోర్టు చేరింది. ‘ఇష్రాత్ జహాన్’ తో పాటు ఆమె ముగ్గురు మిత్రులను బూటకపు ఎన్‌కౌంటర్ లో చంపిన నేరంపైన సి.బి.ఐ విచారణకు గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి బాధితుల్లో విశ్వాసం పాదుకొల్పడంలో విఫలమైనందున సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా హై కోర్టు పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (సిట్)…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా వ్యాపారస్ధుల బంద్

గురువారం భారత దేశ వ్యాపితంగా వ్యాపారస్ధులు బంద్ పాటించారు. రిటైల్ అమ్మకాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు వ్యాపార వర్గాలు పిలుపునిచ్చాయి. న్యూఢిల్లీతో పాటు దేశ వ్యాపితంగా బంద్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఈ బంద్ లో పాల్గొంది. అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహించింది. బి.జె.పి శ్రేణులు ప్రధాన మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసాయి. రాజధాని ఢిల్లీలో కనీసం ఇరవై…

శ్రీకాంత్ గారూ, కిషన్ జీ పార్టీ చేస్తున్నది సాయుధ పోరాటం, సాయుధ అల్లర్లు కాదు

శ్రీకాంత్ గారూ, మీ బ్లాగ్ లో నన్ను ఉద్దేశిస్తూ మంచి ప్రశ్న వేశారు. (ఆ పోస్టును ఇక్కడ చూడండి) సిరియాలో తిరుగుబాటు పేరుతో అక్కడి తిరుగుబాటుదారులు చేస్తున్నది కేవలం అమెరికా తదితర పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసమే. వారు టర్కీ, ఉత్తర లెబనాన్ లలో ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ గూఢచారుల వద్ద శిక్షణ పొంది సిరియాలో ప్రవేశించి ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆ నేరాల్ని సిరియా అధ్యక్షుడు, సైన్యం పైన మోపుతున్నారు. పశ్చిమ దేశాల పత్రికలు కూడా…