ఇరాన్ లో బ్రిటిష్ రాయబార కార్యాలయం విధ్వంసం -ఫొటోలు

ఇరాన్ పైన మరోవిడత అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధించినందుకు ప్రతీకారంగా ఇరాన్ విద్యార్ధులు రాజధాని టెహ్రాన్ లో గల బ్రిటిష్ రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కొద్ది వారాల క్రితం ‘అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ’ (ఐ.ఎ.ఇ.ఎ) ఇరాన్, 2001లో, అణు బాంబుని నిర్మించడానికి ప్రయత్నించిందనడానికి ఆనవాళ్ళు దొరికాయంటూ ‘అభూత కల్పనలతో’ కూడిన నివేదిక ప్రచురించింది. ఐ.ఎ.ఇ.ఎ అంటె అమెరికా తొత్తు సంస్ధ. అమెరికా గీసిన గీత దాటదు. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని…

మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు

లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా…

మా చెక్‌పోస్టులపై దాడి చేస్తున్నామని అమెరికాకి ముందే తెలుసు -పాక్ మిలట్రీ

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పాకిస్ధాన్ చెక్ పోస్టులపైనే తాము దాడి చేస్తున్నామన్న సంగతి అమెరికా హెలికాప్టర్లకూ, జెట్ ఫైటర్లకూ ముందే తెలుసనీ, తెలిసే ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారనీ పాకిస్ధాన్ మిలట్రీ వ్యాఖ్యానించింది. పాకిస్ధాన్ మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ ఈ మేరకు పత్రికలకు వివరాలు వెల్లడించాడు. అమెరికా హెలికాప్టర్లు పాకిస్ధానీ చెక్ పోస్టులపై దాడి చేస్తున్నారని అమెరికా బలగాలను అప్రమత్తం చేసినప్పటికీ కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపాడు. పత్రికా…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత ఆర్ధిక వృద్ధి

2011-12 ఆర్ధిక సంవత్సరంలో రెండో క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు 2011) లో భారత ఆర్ధిక వృద్ధి గత రెండేళ్లలో అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయింది. జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో విస్తరించిన కాలంలో భారత ఆర్ధిక వ్యవస్ధ కేవలం 6.9 శాతం మాత్రమే వృద్ధి చెందిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుదల, సంక్షోభంలో ఉన్న ప్రపంచ కేపిటల్ మార్కెట్లు అన్నీ కలిసి భారత ఆర్ధిక వృద్ధిని…

అమెరికా పాకిస్ధాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ఆఫ్-పాక్ సరిహద్దు -ఫొటోలు

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య సరిహద్దు, ముఖ్యంగా డ్యురాండ్ లైన్ గా భావించే సరిహద్దు సరిగ్గా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లు పరస్పరం అంగీకరించిన సరిహద్దు రేఖ ఇంకా లేకపోవడమే దానికి కారణం. సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఇరు దేశాల్లో ఏ దేశానికి చెందినవన్న దానిపైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక అలానే పడి ఉంది. ఈ ప్రాంతాలు అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న పష్తూన్ తెగకు చెందిన మిలిటెంట్లకు గట్టి స్ధావరాలుగా ఉండడంతో…