అమెరికాపై పాకిస్ధాన్ ప్రతీకారం, అమెరికా సైనికులకు ఆహార, ఆయుధ సరఫరాలు బంద్

ఆఫ్ఘనిస్ధాన్ తో గల సరిహద్దుకు సమీపాన చెక్ పాయింట్ వద్ద కాపలాగా ఉన్న పాకిస్ధాన్ సైనికులు 28 మందిని అమెరికా హెలికాప్టర్ దాడి చేసి చంపడానికి వ్యతిరేకంగా పాకిస్ధాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా సైనికులకు ఆయుధాలు, ఆహారం తన భూభాగం ద్వారా సరఫరా కాకుండా అడ్డుకుంది. అంతమంది సైనికులు తమ దాడిలో చనిపోయినప్పటికీ అమెరికా సైన్యం నుండి ఇంతవరకు సరైన ప్రకటన రాలేదు. “ఎవరైనా చనిపోతే వారికి మా సానుభూతి” అని…

సిరియా అద్దె విప్లవకారులకు ఫ్రాన్సు మిలట్రీ ట్రైనింగ్

సిరియా నుండి పారిపోయి వచ్చిన అద్దె విప్లవకారులకి ఫ్రాన్సు ప్రభుత్వం రహస్యంగా మిలట్రీ ట్రైనింగ్ అందించనున్నట్లుగా ఫ్రాన్సు కి చెందిన వార పత్రిక “లె కెనార్డ్ ఎన్‌షైన్” వెల్లడించింది. ఆ పత్రిక ప్రకారం ఫ్రాన్సు ఏజెంట్లు ప్రస్తుతం లెబనాన్, టర్కీలలో తిష్ట వేసుకుని ఉన్నారు. “‘సిరియా స్వేచ్ఛా సైన్యం’ నిర్మాణానికి ప్రారంభ సైనిక బలగాలను నిర్మించడం” ఆ ఏజెంట్ల ముఖ్య లక్ష్యం. లిబియాలో సోకాల్డ్ తిరుగుబాటు ప్రారంభం కాకముందే అక్కడి తిరుగుబాటుదారులు అమెరికాలో శిక్షణ తీసుకున్నట్లుగానే సిరియా…

పాకిస్ధాన్ లోకి జొరబడి 14 మంది పాక్ సైనికుల్ని చంపిన అమెరికా సైన్యం

అమెరికా హెలికాప్టర్లు మరోసారి పాకిస్ధాన్ లోకి జొరబడ్డాయి. అంతటితో ఆగకుండా ఒక మిలట్రీ చెక్ పాయింటు పై దాడి చేసి అక్కడ ఉన్న 14 మంది పాకిస్ధాన్ సైనికుల్ని చంపేశాయి. ఘటనలో మరో నలుగురు గాయపడ్డాఅరు. ఈ మేరకు పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ అధికారులు పత్రికలకు సమాచారం అందించారు. దాడిలో మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారని స్ధానిక వార్తలను ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. సలాలా చెక్ పాయింట్ గా పిలిచే ఈ మిలట్రీ చెక్…

‘వాల్ మార్ట్’ స్టోర్ ని తగలబెడతా -ఉమా భారతి

వాల్ మార్ట్ లాంటి బహుళజాతి రిటైల్ కంపెనీలు భారత దేశంలో షాపులు పెట్టినట్లయితే వాటిని స్వయంగా తగలబెడతానని బి.జె.పి నాయకురాలు ఉమా భారతి ప్రకటించింది. భారత దేశంలో ఎక్కడ షాపు పెట్టిన తక్కడికి తన కార్యకర్తలతో వెళ్ళి తగలబెడతానని ఆమె ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత దేశ చిల్లర అమ్మకాల (రిటైల్) రంగంలోకి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగిల్ బ్రాండ్ రంగం లో వందశాతం, మల్టీ బ్రాండ్ రంగంలో 51 శాతం…

‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ఎవరు?

(మిత్రుడు డేవిడ్ రాసిన వ్యాఖ్యను పోస్టు గా మలిచాను -విశేఖర్) ఒక ఉత్తరం, సందేశం (అమ్మను చూడాలను ఉంది -రచన: కిషన్ జీ) ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు. దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే. ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను…