ఎన్‌కౌంటర్ లో కాదు, ‘కిషన్ జీ’ ని చిత్ర హింసలు పెట్టి చంపారు -వరవర రావు
మావోయిస్టు నాయకుడు ‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ను బెంగాల్ పోలీసులు చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారని ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) సభ్యుడు వరవర రావు శుక్రవారం ఆరోపించాడు. “కిషన్ జీ దేహంపై అనేక గాయాలున్నాయి. ఆయన్ని బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపే ముందు చిత్ర హింసలు పెట్టారని ఆ గాయలను బట్టి అర్ధమవుతోంది” అని వరవర్రావు కోల్‌కతా లో మాట్లాడుతూ అన్నాడు. ఒక రోజు…
