“ఆకుపై” ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? -మ్యాప్

18-11-2011 తేదీ నాటికి తనకు అందిన సమాచారం మేరకు ‘ది గార్డియన్’ పత్రిక ‘ఆకుపై’ ఉద్యమాలు నడుస్తున్న ప్రాంతాలను ప్రపంచ పటంపై గుర్తించి ప్రచురించింది. ప్రపంచవ్యాపితంగా 82 దేశాల్లోని 951 నగరాల్లో ‘ఆకుపై’ ఉద్యమాలు జరుగుతుండగా తాను 750 నగరాలను గుర్తించినట్లుగా ‘ది గార్డియన్’ చెబుతోంది. అమెరికాలో ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ గా ప్రారంభమైన చోట (జుకొట్టి పార్క్) ఆందోళనకారులను రెండు రోజుల క్రితం పోలీసులు బలవంతంగా ఖాళీ చేశారు. అమెరికాలోని ఇతర నగరాల్లో కూడా ఇలాగే…

బ్రిటన్, జర్మనీలలో ఎవరు మెరుగు?

“ది టెలిగ్రాఫ్” అందించిన ఈ సూచికలను బట్టి మొత్తం మీద జర్మనీ కంటే బ్రిటనే మెరుగ్గా కనిపిస్తోంది. కాని జర్మనీ యూరోజోన్ కూటమితో పాటు, యూరోపియన్ యూనియన్ కు కూడా (అనధికార) నాయకడుగా చెలామణి అవుతోంది. ఆర్ధికంగా చూసినా జిడిపి వృద్ధి, సైజు లలో జర్మనీయే ముందంజలో ఉంది. జర్మనీ మొత్తం మీద చూస్తే ముందంజలో ఉండగా, బ్రిటన్ తలసరి లెక్కల్లో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. – –

ఎయిర్ టెల్, వొడాఫోన్ లపై సి.బి.ఐ దాడులు, ఇక బి.జె.పి వంతు?

ఇక సి.బి.ఐ కన్ను బి.జె.పి పాలనలోని స్పెక్ట్రమ్ అవకతవకలపై పడింది. శనివారం వొడాఫోన్ భారతీయ యూనిట్ కార్యాలయం పైనా, ఎయిర్ టెల్ కార్యాలయం పైనా దాడులు చేసింది. 2001-02 లో ప్రభుత్వం చేసిన స్పెక్ట్రం కేటాయింపులపైన వివరాలు సేకరించే లక్ష్యంతో ఈ దాడులు నిర్వహించింది. బి.జె.పి ప్రభుత్వ కాలంలో జరిగిన స్పెక్ట్రం కేటాయింపులలో అవకతవకలు జరిగాయో లేదో నిర్ధారించుకునే క్రమంలో తగిన సమాచార సేకరణకు ఈ దాడులు నిర్వహించినట్లుగా సి.బి.ఐ ప్రతినిధి ధరణి మిశ్రా తెలిపింది. “ప్రభుత్వ…

చిల్లర దుకాణాల కడుపు కొట్టడానికి సర్వం సిద్ధం

చిన్నపాటి రిటైల్ దుకాణదారుల కడుపు పైన కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. భారత దేశ వ్యాపితంగా పల్లెల్లో, పట్నాల్లో ప్రతి వీధి చివరా, సెంటర్లలో రోజూ మనకు కనిపించే రిటైల్ దుకాణాలు రానున్న రోజుల్లో కనిపించక పోవచ్చు. కొన్ని కోట్లమంది దుకాణదారులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంతవరకూ మల్టిబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం సింగిల్ బ్రాండ్ లోనే విదేశీ పెట్టుబడులను…

పాక్ సైన్యానికి వ్యతిరేకంగా అమెరికా సాయం కోరిన అధ్యక్షుడు జర్దారీ

పాకిస్ధాన్ దివంగత మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త, పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ చుట్టూ ‘మెమో గేట్’ కుంభకోణం ముసురుకుంటోంది. అమెరికా ప్రత్యేక బలగాలు పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి ఒసామా బిన్ లాడెన్ ను హత్య చేసిన అనంతరం పాకిస్ధాన్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చి మిలట్రీ ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పుతుందన్న భయంతొ అది జరగకుండా ఉండడానికి పాక్ అధ్యక్షుడు అమెరికా సహాయం కోరినట్లుగా ఒక మెమో వెల్లడి కావడంతో ‘మెమో గేట్’ కు…

మరో లిబియా కానున్న సిరియా, అమెరికాకు అరబ్ లీగ్ సహకారం -కార్టూన్

లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వ కూల్చివేతకు అమెరికా, యూరప్ లతో సహకరించిన అరబ్ లీగ్, ఇప్పుడు సిగ్గు విడిచి సిరియాను కూడా పశ్చిమ దేశాల విష పరిష్వంగంలోకి నెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. లిబియా గగనతలాన్ని ‘నిషిద్ధ గగనతలం’ గా ప్రకటించి అమలు చేయడంలోనూ, ఆదేశంపై పశ్చిమ దేశాలు ఏడు నెలలపాటు బాంబు దాడులు చేసి సర్వనాశనం చేయడంలోనూ అరబ్ లీగ్ కూటమి అమెరికా, యూరప్ లకు పూర్తిగా సహకరించింది. పశ్చిమ దేశాల ఎంగిలి మెతుకులకు రుచిమరిగిన అరబ్ లీగ్,…