ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు -రష్యా

ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ యూరోపియన్ యూనియన్ పిలుపు ఇవ్వడాన్ని రష్యా తిరస్కరించింది. ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. బుధవారం బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్, ఇరాన్ పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాడు. 2003లో అణ్వాయుధాలు నిర్మించడానికి ఇరాన్ ప్రయత్నించినట్లుగా ఐ.ఎ.ఇ.ఎ ఇటీవల తన నివేదికలో పేర్కొనడాన్ని చూపిస్తూ విలియం హేగ్, ఈ డిమాండ్ చేశాడు. రష్యా తిరస్కరణతో ఇరాన్ పై ఆంక్షలు…

చేయిదాటుతున్న ఇటలీ సంక్షోభం, యూరోపియన్ యూనియన్ చీలిక తప్పదా?

ఇటలీలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం చేయిదాటి పోతోంది. దాని ఫలితంగా యూరోపియన్ యూనియన్, ఒక యూనియన్ గా నిలబడలేక పోవచ్చన్న భయాలు ఏర్పడుతున్నాయి. యూరప్ లో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఇటలీ సావరిన్ బాండ్లపైన వడ్డీ డిమాండ్ ఏడు శాతాన్ని మించి పలుకుతుండడంతో ఇటలీ రుణ సేకరణ అసాధ్యంగా మారుతోంది. దానితో ఇటలీకి రుణ సేకరణ కష్టంగా మారి ఇ.యు రక్షణ నిధి నుండి బెయిలౌట్ ఇవ్వవలసి ఉంటుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. పెద్ద ఆర్ధిక…

‘అజ్మల్ కసబ్’ ను ఉరి తియ్యాలి -పాకిస్తాన్ హోం మంత్రి

పాకిస్ధాన్ మొదటిసారిగా కసబ్ ను టెర్రరిస్టు అని పేర్కొంది. “కసబ్ ఒక టెర్రరిస్టు. అతను ప్రభుత్వేతర వ్యక్తి. అతనిని ఉరి తీయాలి” అని పాకిస్ధాన్ అంతర్గత (హోం) శాఖా మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నాడు. మాల్దీవుల లో జరుగుతున్న సార్క్ సమావేశాల సందర్భంగా హాజరైన రెహ్మాన్ మాలిక్ అక్కడ భారత విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్ధాన్ నుండి త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఇండియా సందర్శించనున్నదనీ, ఆ సందర్శన ముంబై టెర్రరిస్టు దాడులపైన పాక్ లో…