వీధి బాలుడి చిత్ర కళా కౌశలం -వీడియో

తాను అనుకున్న బొమ్మని చాలా వేగంగా ఈ గీసేస్తున్నాడు, ఈ బాలుడు. చూడ్డానికి వీధి బాలుడిలా కనిపిస్తున్నాడు. ఇతన్ని ఎవరైనా చేరదీసి శిక్షణ ఇవ్వగలిగితే, లేదా ఇప్పిస్తే తన ప్రతిభను ఇంకా ఉన్నత స్ధాయిలో రుజువు చేసుకోగలడేమో. ఫేస్ బుక్ పేజి లో ఈ వీడియో లభ్యమయ్యింది.

ముస్లింల దైవ ప్రార్ధనలో క్రమశిక్షణ ఉంటుంది -బక్రీద్ ఫొటోలు

ముస్లిం మతస్ధులు దైవ ప్రార్ధన (నమాజు) చేసేటప్పుడు చాలా క్రమ శిక్షణ కనిపిస్తుంది. మిగత మత ప్రార్ధనలలో ఇది పెద్దగా కనిపించదనుకుంటా. హిందూ పుణ్య క్షేత్రాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. తిరుపతి దగ్గర్నుండి ఏ గుడి తీసుకున్నా అంతా కోలాహలం. కానుకలు కూడా కోలాహలమే. ప్రసాదం దగ్గర కూడా. బౌద్ధ మత ప్రార్ధనలు ఎలా ఉంటాయో ఎరుగం. శిక్కుల గురుద్వారాల్లో కూడా కోలాహలం కనిపిస్తుంది. అయితే గురుద్వారాల్లో హిందూ దేవాలయాల్లో కనిపించేటంత కోలాహలం ఉండదు. బహుశా జైన…

ఇజ్రాయెల్ వెబ్‌సైట్లపై ‘ఎనోనిమస్’ సైబర్ దాడులు, నిరాకరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ గూఢచార సంస్ధలు, ఆర్మీ లతో పాటు వివిధ ప్రభుత్వ వెబ్ సైట్లపైన సైబర్ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ‘ఎనోనిమస్’ సంస్ధ ప్రకటించిన రెండు రోజుల్లోనే సదర్ వెబ్ సైట్లన్నీ అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టించింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ రూపొందించడంలో పేరెన్నికగన్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వెబ్ సైట్లే హ్యాకింగ్ కి గురైతే ఆ వార్త ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అందుకేనేమో ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ సైట్లను ఎవరూ హ్యాక్ చెయ్యలేదనీ, కొన్ని సమస్యలవలన మాత్రమే తాత్కాలికంగా…

విడిపోయి ఓడిపోవడం ఇపుడు యూరప్ వంతు? -కార్టూన్

ఎక్కడికక్కడ విభేధాలు సృష్టించి ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్నాయి యూరప్ దేశాలు. ఇపుడు తమ అప్పు సంక్షోభం పరిష్కరించుకునే విషయంలో యూరప్ దేశాలు ఏకాభిప్రాయం కుదరక కిందమీదలవుతున్నాయి. గట్టి పరిష్కారం చూపలేక విడిపోయిన అభిప్రాయాలతో సాయం చెయ్యమని బైటివారిని కోరుతున్నాయి. – –

జీహాదిస్టులకు సమీపంలో పాక్ అణ్వస్త్రాలు, కొట్టిపారేసిన పాకిస్ధాన్

పాకిస్ధాన్ నిల్వ చేసుకున్న అణ్వస్త్రాలు అక్కడ తలచాదుకున్న జిహాదీ శక్తులకు అత్యంత సమీపంలో ఉన్నాయనీ, పాక్ అణ్వస్త్ర భద్రత ప్రమాదంలో పడిందనీ విశ్లేషిస్తూ అమెరికా పత్రిక “అట్లాంటిక్’ ప్రచురించిన కధనాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది తమ శత్రువులు నిరంతరం తమకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారమేననీ, నిజానికిది కొత్తకాదనీ పాక్ నిరసించింది. వాస్తవంలో అమెరికా డేగకళ్ళనుండే తమ అణ్వస్త్రాలకు ప్రమాదం ఏర్పడిందనీ పాకిస్ధాన్, అమెరికా మొఖాన్నే కాసింత బురద జల్లింది. పాకిస్ధాన్ దేశాన్ని, అమెరికాకి ‘నరకం నుండి…